Share News

ఇక్కడైనా జరిగేనా?

ABN , Publish Date - Feb 22 , 2026 | 05:14 AM

టీ20 వరల్డ్‌కప్‌ సూపర్‌-8లో భాగంగా ఆదివారం ఆతిథ్య శ్రీలంక జట్టును ఇంగ్లండ్‌ను ఎదుర్కొనబోతోంది. గత నెలలో ఇదే ఇంగ్లండ్‌ చేతిలో లంక 0-3తో వైట్‌వాష్‌ అయ్యింది....

ఇక్కడైనా జరిగేనా?

నేడు ఇంగ్లండ్‌తో శ్రీలంక ఢీ

మ.3 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో

మ్యాచ్‌కు వరుణుడి ముప్పు

పల్లెకెలె: టీ20 వరల్డ్‌కప్‌ సూపర్‌-8లో భాగంగా ఆదివారం ఆతిథ్య శ్రీలంక జట్టును ఇంగ్లండ్‌ను ఎదుర్కొనబోతోంది. గత నెలలో ఇదే ఇంగ్లండ్‌ చేతిలో లంక 0-3తో వైట్‌వాష్‌ అయ్యింది. ఈ కీలక పోరుతో ఆ పరాభవానికి బదులు తీర్చుకోవాలనుకుంటోంది. ఓపెనర్‌ నిస్సాంక, కుశాల్‌ మెండి్‌సల ఫామ్‌ లంకకు కీలకం కానుంది. స్పిన్నర్‌ తీక్షణ, మదుషంక, చమీర ప్రత్యర్థిని ఇబ్బందిపెట్టగలరు. అటు టోర్నీలో ఇంగ్లండ్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. కానీ లంకపై గతంలో సిరీస్‌ నెగ్గిన ఉత్సాహంతో ఉన్న బ్రూక్‌ బృందం అదే జోరును కొనసాగించాలనుకుంటోంది. అయితే, ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడు పొంచి ఉండడం ఇరుజట్లనూ ఆందోళనపరుస్తోంది. మ్యాచ్‌ జరిగే మధ్యాహ్నం సమయంలో ఇక్కడ భారీ వర్షం కురిసే చాన్సుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

ఇవీ చదవండి:

'ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా భారత్‌ను సందర్శించాల్సిందే'

ట్రంప్ సంచలన నిర్ణయం.. ప్రపంచం ముందుకు ఏలియన్స్ సీక్రెట్ ఫైల్స్

Updated Date - Feb 22 , 2026 | 05:14 AM