ఎదురులేని సఫారీలు
ABN , Publish Date - Mar 02 , 2026 | 04:58 AM
సికందర్ రజా (73, 3/29) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టినా.. టీ20 వరల్డ్‌క్‌పలో దక్షిణాఫ్రికా జైత్రయాత్రను అడ్డుకోలేక పోయాడు. ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను సొంతం చేసుకొన్న మార్‌క్రమ్ సేన.. సూపర్-8లో భాగంగా గ్రూప్-1లో ఆదివారం..
5 వికెట్లతో జింబాబ్వేపై గెలుపు
రజా ఆల్‌రౌండ్ షో వృథా
గ్రూప్‌లో అగ్రస్థానం
న్యూఢిల్లీ: సికందర్ రజా (73, 3/29) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టినా.. టీ20 వరల్డ్‌క్‌పలో దక్షిణాఫ్రికా జైత్రయాత్రను అడ్డుకోలేక పోయాడు. ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను సొంతం చేసుకొన్న మార్‌క్రమ్ సేన.. సూపర్-8లో భాగంగా గ్రూప్-1లో ఆదివారం జరిగిన తమ ఆఖరి మ్యాచ్‌లో 5 వికెట్లతో జింబాబ్వేపై గెలిచింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి ఆరు పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచిన సఫారీలు.. బుధవారం కోల్‌కతాలో జరిగే తొలి సెమీ్‌సలో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనున్నారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకొన్న జింబాబ్వే 20 ఓవర్లలో 153/7 స్కోరు చేసింది. మపాక, బోష్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఒకవైపు వికెట్లు టపాటపా రాలుతున్నా కెప్టెన్ సికందర్ రజా అర్ధ శతకంతో ఒంటరి పోరాటం చేశాడు. చివర్లో రజాతో కలసి మదాండె (26 నాటౌట్) దూకుడుగా ఆడడంతో.. టీమ్ స్కోరు 150 మార్క్ దాటింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (15) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా 17.5 ఓవర్లలో 154/5 స్కోరు చేసి గెలిచింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్ (0), కెప్టెన్ మార్‌క్రమ్ (4)ను సికందర్ స్వల్ప స్కోరుకే అవుట్ చేసి షాకిచ్చాడు. కానీ, రికెల్టన్ (31), డెవాల్డ్ బ్రెవిస్ (42), మిల్లర్ (22) పరిస్థితిని చక్కదిద్దారు. వీరు అవుటైన తర్వాత.. స్టబ్స్ (21 నాటౌట్), లిండే (30 నాటౌట్) ఆరో వికెట్‌కు అజేయంగా 53 పరుగులు జోడించడంతో.. సౌతాఫ్రికా మరో 13 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకొంది. ఓటమి పాలైన జింబాబ్వే సారథి సికందర్ రజాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
సంక్షిప్త స్కోర్లు
జింబాబ్వే: 20 ఓవర్లలో 153/7 (సికందర్ 73, క్లైవ్ మదాండే 26 నాటౌట్; మపాక 2/21, బాష్ 2/40).
దక్షిణాఫ్రికా: 17.5 ఓవర్లలో 154/5 (బ్రెవిస్ 42, లిండే 30 నాటౌట్; సికందర్ 3/29).
ఇవి కూడా చదవండి:
టీ20 డబ్ల్యూసీ: విండీస్‌తో పదేళ్ల నాటి పగ.. తీర్చుకునేందుకు సూర్య సేన రెడీ
టీ20 డబ్ల్యూసీ: పాకిస్థాన్ ఓపెనర్ విధ్వంసం.. కోహ్లీ వరల్డ్ రికార్ట్ బ్రేక్