సిరీస్ దక్షిణాఫ్రికా వశం
ABN , Publish Date - Mar 26 , 2026 | 01:48 AM
న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 3-2తో సొంతం చేసుకొంది. బుధవారం జరిగిన ఆఖరి, ఐదో టీ20లో దక్షిణాఫ్రికా...
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 3-2తో సొంతం చేసుకొంది. బుధవారం జరిగిన ఆఖరి, ఐదో టీ20లో దక్షిణాఫ్రికా 33 పరుగులతో గెలిచింది. తొలుత దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 187/4 స్కోరు చేసింది. కానర్ ఎస్టర్‌హుజెన్ (75) అర్ధ శతకంతో అదరగొట్టగా.. హెర్మన్ (35), ముల్డర్ (31) రాణించారు. ఛేదనలో కివీస్ ఓవర్లన్నీ ఆడి 154/8 స్కోరుకే పరిమితమైంది. జాకబ్స్ (36), రాబిన్సన్ (25) టాప్ స్కోరర్లు. కొట్జీ, ముల్డర్, బార్ట్‌మన్ తలో 2 వికెట్లు దక్కించుకొన్నారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు సూపర్ స్యూస్!
ధురంధర్-2 డైలాగ్‌తో బుమ్రాకు భార్య సంజన పంచ్.. పోస్ట్ వైరల్