‘టైమ్స్’ జాబితాలో మంధాన
ABN , Publish Date - Jun 17 , 2026 | 03:30 AM
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధానకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక టైమ్స్ మ్యాగజైన్...
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధానకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక టైమ్స్ మ్యాగజైన్ వెల్లడించిన క్రీడారంగంలో 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాలో ఆమెకు చోటు దక్కింది. భారత్ నుంచి కేవలం మంధానకు మాత్రమే ఇందులో చోటు దక్కడం విశేషం. ‘దేశవాళీ వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ, మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ, అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో అత్యధికంగా 17 శతకాలు బాదిన క్రికెటర్‌గా నిలిచిన మంధానకు రికార్డులు దాసోహమవుతున్నాయి’ అని టైమ్స్ పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
నీట్ రీ-ఎగ్జామ్‌కు ఇంత భద్రత ఎందుకు.. కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై..
సూచీలకు జోష్.. రెండో రోజూ కొనసాగిన లాభాలు..