శతకంతో ‘శుభా’రంభం
ABN , Publish Date - Feb 25 , 2026 | 05:56 AM
తొలి రంజీ టైటిల్ కోసం బరిలోకి దిగిన జమ్మూ కశ్మీర్ ఫైనల్‌పోరులో శుభారంభాన్ని అందుకుంది. మంగళవారం కర్ణాటకతో మొదలైన ఈ మ్యాచ్‌లో శుభమ్ పందిర్ (117 నాటౌట్) అజేయ సెంచరీతో...
జమ్మూ కశ్మీర్ 284/2 జూకర్ణాటకతో రంజీ ఫైనల్
హుబ్బళ్ళి (కర్ణాటక): తొలి రంజీ టైటిల్ కోసం బరిలోకి దిగిన జమ్మూ కశ్మీర్ ఫైనల్‌పోరులో శుభారంభాన్ని అందుకుంది. మంగళవారం కర్ణాటకతో మొదలైన ఈ మ్యాచ్‌లో శుభమ్ పందిర్ (117 నాటౌట్) అజేయ సెంచరీతో విజృంభించాడు. దీంతో మొదటిరోజు ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్‌లో జమ్మూకశ్మీర్ 2 వికెట్లకు 284 పరుగులు సాధించింది. శుభమ్ శతకానికి తోడు ఓపెనర్ యావర్ హసన్ (88), అబ్దుల్ సమద్ (52 నాటౌట్) అర్ధ సెంచరీలతో సత్తా చాటారు. కెప్టెన్ పరాస్ డోగ్రా (9) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ప్రసిద్ధ్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టాడు. శుభమ్‌కు తోడుగా సమద్ క్రీజులో ఉన్నాడు.
ఇవి కూడా చదవండి..
మాజీ మంత్రి మల్లారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..
కొత్త పార్టీని ప్రకటించిన శశికళ