Share News

భారత్‌ నాకు రెండో ఇల్లు

ABN , Publish Date - Aug 21 , 2026 | 02:56 AM

ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ భారత్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. స్థానికంగా భారత కాన్సులేట్‌ నిర్వహించిన స్వాతంత్య్రదిన వేడుకల్లో అతడు పాల్గొన్నాడు...

భారత్‌ నాకు రెండో ఇల్లు

సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ భారత్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. స్థానికంగా భారత కాన్సులేట్‌ నిర్వహించిన స్వాతంత్య్రదిన వేడుకల్లో అతడు పాల్గొన్నాడు. 19 ఏళ్ల వయస్సులో భారత్‌లో తొలిసారి పర్యటించానని, అప్పటికీ ఇప్పటికీ దేశం ఎంతో అభివృద్ధి చెందిందని కొనియాడాడు. అలాగే తనను ఆసీ్‌సలోకన్నా భారత్‌లోనే ఎక్కువ మంది అభిమానిస్తారని గుర్తుచేశాడు. ఐపీఎల్‌ ద్వారా తనకు లభించిన ఆదరణ అద్భుతమని, అక్కడి ప్రజలతో చక్కటి అనుబంధం ఏర్పడిందని అన్నాడు. వాట్సన్‌ ఐపీఎల్‌లో 2008 నుంచి 2020 వరకు రాజస్థాన్‌, బెంగళూరు, చెన్నై జట్ల తరఫున 145 మ్యాచ్‌ల్లో బరిలోకి దిగాడు.

ఇవి కూడా చదవండి:

పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్

బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Aug 21 , 2026 | 02:56 AM