Share News

నేనెందుకు కష్టపడాలి?

ABN , Publish Date - Nov 03 , 2026 | 05:00 AM

భారత జట్టులో తనకు చోటు లేకపోవడంపై మిడిలార్డర్‌ బ్యాట ర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ తీవ్ర ఆవేదన వ్యక్తంజేశాడు. బరువు తగ్గి ఫిట్‌నెస్‌ మెరుగుపరుచుకున్నా...

నేనెందుకు కష్టపడాలి?

ముంబై: భారత జట్టులో తనకు చోటు లేకపోవడంపై మిడిలార్డర్‌ బ్యాట ర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ తీవ్ర ఆవేదన వ్యక్తంజేశాడు. బరువు తగ్గి ఫిట్‌నెస్‌ మెరుగుపరుచుకున్నా, దేశవాళీ పోటీలలో ధారాళంగా పరుగులు చేస్తున్నా తనకు చాన్సు రాకపోవడంతో 29 ఏళ్ల ఈ ముంబైకర్‌ నిర్వేదం వ్యక్తంజేస్తూ ‘నేను ఇంకా ఎందుకు కష్టపడాలి’ అని ప్రశ్నించాడు. ఫిబ్రవరి 2024లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్‌ ఇప్పటివరకు కేవలం ఆరు టెస్ట్‌లే..అదీ స్వదేశంలోనే ఆడడం గమనార్హం. సాయి సుదర్శన్‌ గాయపడడంతో సర్ఫరాజ్‌ను ఇటీవలి శ్రీలంక పర్యటనకు ఎంపిక చేశారు. కానీ తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఈ ముంబైకర్‌ 2024లో వాంఖడేలో న్యూజిలాండ్‌పై చివరిసారి టెస్ట్‌ ఆడాడు. ‘ఇప్పటికే ఎంతో జరిగిపోయింది. నేను ఎక్కువగా ఆలోచించడంలేదు. నేను ఎందుకు శ్రమించాలని రోజూ ఉదయం లేవగానే నన్ను నేను ప్రశ్నించుకుంటా’ అని సర్ఫరాజ్‌ అన్నాడు.

ఇవి కూడా చదవండి:

ముక్కోణపు సిరీస్ గెలిచిన ఆనందంలో పాక్.. షాకిచ్చిన ఐసీసీ!

ఐర్లాండ్‌పై నమీబియా చరిత్రాత్మక విజయం..

అభిషేక్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన న్యూజిలాండ్ బ్యాటర్..

Updated Date - Nov 03 , 2026 | 05:00 AM