వారిద్దరు ఫెడరర్, అల్కారజ్‌లు
ABN , Publish Date - Jun 23 , 2026 | 05:24 AM
టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీని టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌తో కీపర్ సంజూ శాంసన్ పోల్చాడు. అలాగే దూకుడుగా ఆడే విరాట్ కోహ్లీని స్పెయిన్ సంచలనం...
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీని టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌తో కీపర్ సంజూ శాంసన్ పోల్చాడు. అలాగే దూకుడుగా ఆడే విరాట్ కోహ్లీని స్పెయిన్ సంచలనం కార్లోస్ అల్కారజ్‌గా అభివర్ణించాడు. టెన్ని్‌సలో అత్యంత ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ వింబుల్డన్ కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో టెన్నిస్, క్రికెట్ దిగ్గజాలను శాంసన్ సరిపోల్చాడు. ‘క్రికెట్‌లో ఫెడరర్ ఎవరంటే నిస్సందేహంగా ధోనీయే. అతడు తన పనిని నిబ్బరంగా, ప్రశాంతంగా నిర్వర్తిస్తాడు. మహీ ఆడుతున్నప్పుడు అది ఎంతో సునాయాసంగా అనిపించినా చాలా శక్తివంతంగా ఉంటుంది’ అని ఓ క్రీడా చానెల్ చర్చలో సంజూ గుర్తు చేశాడు. ‘అల్కారజ్ కోర్టులో చాలా దూకుడు ప్రదర్శిస్తాడు. అది విరాట్ భాయ్ మాదిరి ఉంటుంది. అందువల్ల అల్కారజ్‌తో కోహ్లీని పోల్చవచ్చు’ అని శాంసన్ పేర్కొన్నాడు.
ఈ వార్తలనూ చదవండి:
లఖ్‌నవూ అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..
లఖ్‌నవూలోని కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం..