Share News

శతక్కొట్టిన సుదర్శన్‌: భారత్‌ ‘ఎ’ 247/1

ABN , Publish Date - Jul 04 , 2026 | 01:47 AM

సాయి సుదర్శన్‌ (104 నాటౌట్‌) మరో శతకం బాదాడు. అతడికి దేవదత్‌ పడిక్కళ్‌ (94 నాటౌట్‌) తోడవడంతో...

శతక్కొట్టిన సుదర్శన్‌: భారత్‌ ‘ఎ’ 247/1

గాలె (శ్రీలంక): సాయి సుదర్శన్‌ (104 నాటౌట్‌) మరో శతకం బాదాడు. అతడికి దేవదత్‌ పడిక్కళ్‌ (94 నాటౌట్‌) తోడవడంతో శ్రీలంక ‘ఎ’తో రెండో అనధికార టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ ‘ఎ’ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. వీరిద్దరు రెండో వికెట్‌కు అభేద్యంగా 181 పరుగు లు జోడించడంతో..రెండో రోజు ఆఖరికి భారత్‌ ‘ఎ’ వికెట్‌ నష్టానికి 247 పరుగులు చేసింది. అంతకుముందు ఓవర్‌నైట్‌ 288/5 స్కోరుతో శుక్రవారం తొలిఇన్నింగ్స్‌ కొనసాగించిన శ్రీలంక ‘ఎ’ 366 రన్స్‌కు ఆలౌటైంది.

ఈ వార్తలనూ చదవండి:

వీధులు శుభ్రం చేసినట్టు ఏఐ చిత్రాలు.. మున్సిపల్ సిబ్బందిపై వేటు

సింధు జలాలపై భారత్‌ కఠిన వైఖరి.. ఉగ్రవాదం ఆగేదాకా..

Updated Date - Jul 04 , 2026 | 01:47 AM