Share News

ఇంపాక్ట్‌ ప్లేయర్‌ వద్దు

ABN , Publish Date - Jun 01 , 2026 | 03:18 AM

ఐపీఎల్‌ను మరింత రసవత్తరంగా మార్చేందుకు బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ మార్పులను సూచించాడు. ‘ఐపీఎల్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ అవసరం లేదు. టీ20 అంటేనే బ్యాటర్ల ఆటగా...

ఇంపాక్ట్‌ ప్లేయర్‌ వద్దు

  • పవర్‌ప్లే రెండుసార్లు

  • ఐపీఎల్‌కు సచిన్‌ సూచనలు

ముంబై: ఐపీఎల్‌ను మరింత రసవత్తరంగా మార్చేందుకు బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ మార్పులను సూచించాడు. ‘ఐపీఎల్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ అవసరం లేదు. టీ20 అంటేనే బ్యాటర్ల ఆటగా మారింది. దీనికి అదనంగా మరో బ్యాటర్‌ను ఆడించడంతో బౌలర్లకు మరింత కష్టంగా మారింది. అలాగే ఆరు ఓవర్ల పవర్‌ప్లేను రెండుసార్లు అమలు చేస్తే బాగుంటుంది. ముందుగా తొలి నాలుగు ఓవర్లను వేయించాక మిగిలిన రెండు ఓవర్లను బౌలింగ్‌ జట్టు కెప్టెన్‌ నిర్ణయానికి వదిలేయాలి. దీంతో మ్యాచ్‌ రెండు జట్లకూ ని యంత్రణలోనే ఉంటుంది. దీంతో పాటు ఒక బౌలర్‌కు ఐదు ఓవర్లు వేసే వెసులుబాటు ఉండాలి. టాప్‌ బ్యాటర్లు మ్యాచ్‌ ఆద్యంతం బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు బెస్ట్‌ బౌలర్‌ ఐదు ఓవర్లు వేస్తే తప్పేం లేదని నా అభిప్రాయం’ అని సచిన్‌ తెలిపాడు.

ఇవి కూడా చదవండి:

ఇషాన్ కిషన్‌ను దాటి అత్యధిక ధర పలికిన ఎంఐ ప్లేయర్

ఐపీఎల్ ఫైనల్‌: కోహ్లీ గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 01 , 2026 | 03:18 AM