Share News

వీడ్కోలు తప్పదా?

ABN , Publish Date - Jul 18 , 2026 | 05:26 AM

హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మను ఇక బ్లూ జెర్సీలో చూడలేమా? ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ తనకు చివరిదా? ఏమో.. మీడియాలో కథనాలు మాత్రం రోహిత్‌ రిటైర్మెంట్‌...

వీడ్కోలు తప్పదా?

రేపటి వన్డేనే రోహిత్‌కు ఆఖరిదని కథనాలు

హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మను ఇక బ్లూ జెర్సీలో చూడలేమా? ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ తనకు చివరిదా? ఏమో.. మీడియాలో కథనాలు మాత్రం రోహిత్‌ రిటైర్మెంట్‌ ఖాయమంటున్నాయి. నిజానికి తను వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌క్‌పలో ఆడాలని బలంగా కోరుకుంటున్నాడు. కానీ అంతకన్నా ముందే అతడిని పక్కనబెట్టేందుకు సెలెక్టర్లు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ఈ సమాచారాన్ని అతడితో పాటు ప్రధాన కోచ్‌ గౌతం గంభీర్‌కు కూడా చేరవేసినట్టు చెబుతున్నారు. దీంతో బహుశా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగే మూడో వన్డే అతడి కెరీర్‌లో చివరిది కావచ్చు. అయితే సెలెక్టర్ల నిర్ణయంపై మాత్రం రోహిత్‌ అసంతృప్తిగానే ఉన్నాడు. తన మనసులో మాటను ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న బీసీసీఐ అధికారులు, సెలెక్టర్లతో నేరుగా చెప్పినట్టు సమాచారం. అటు రోహిత్‌ ఫిట్‌నె్‌సను మెరుగుపర్చుకునేందుకు తన శరీర బరువును కూడా గణనీయంగా తగ్గించుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌ టూర్‌లో ఆడిన రెండు వన్డేల్లోనూ తేలిపోవడం కూడా రోహిత్‌కు ఇబ్బందిగా మారింది. ఇక, తమ జట్టు బ్యాటింగ్‌ లైన్‌పకు రోహిత్‌ వెన్నెముక అంటూ కెప్టెన్‌ గిల్‌ చెబుతుంటే.. సెలెక్టర్లు మాత్రం మరో విధంగా ఆలోచిస్తున్నారు.

రవిశాస్త్రి చెప్పేశాడు: ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో కామెంటేటర్‌ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ‘రోహిత్‌ వన్డే వరల్డ్‌క్‌పలో ఆడకపోవచ్చు. మీడియా సర్కిల్‌లో బలంగా వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఇప్పటికే రోహిత్‌తో ఈ విషయమై బోర్డు అధికారులు మాట్లాడారు’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.

లార్డ్స్‌ చేరిన తల్లిదండ్రులు

లార్డ్స్‌లో జరిగే చివరి వన్డే మ్యాచ్‌ను తిలకించేందుకు రోహిత్‌ శర్మ తల్లిదండ్రులు లండన్‌ చేరుకున్నారు. దీంతో అతడి రిటైర్మెంట్‌ వార్తలకు మరింత బలం చేకూరింది. వాస్తవానికి రోహిత్‌ ఆడే మ్యాచ్‌ల సమయంలో వాళ్లు మైదానంలో కనిపించడం చాలా అరుదు.

ఇవి కూడా చదవండి:

ఫిఫా ప్రపంచ కప్ 2026: ఫైనల్ మ్యాచ్‌కు డొనాల్డ్ ట్రంప్

Updated Date - Jul 18 , 2026 | 05:26 AM