పరాగ్‌కు జరిమానా
ABN , Publish Date - May 01 , 2026 | 02:16 AM
ఈ-సిగరెట్ వివాదంలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌పై బీసీసీఐ జరిమానాతో సరిపెట్టింది...
న్యూఢిల్లీ: ఈ-సిగరెట్ వివాదంలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌పై బీసీసీఐ జరిమానాతో సరిపెట్టింది. మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో పరాగ్ నిషేధిత ఈ-సిగరెట్ తాగుతూ కనిపించాడు. దీంతో అతడిపై మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను అతిక్రమించాడనే కారణంతో మ్యాచ్ ఫీజులో 25శాతం జరిమానాతో పాటు ఓ డీమెరిట్ పాయింట్‌ను చేర్చారు. రియాన్ తన తప్పును అంగీకరించినట్టు బోర్డు పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
ముంబై జట్టుకు మద్దతుగా వాంఖడే స్టేడియానికి వినోద్ కాంబ్లీ