రూ.15 కోట్లకే ఢిల్లీ చెంతకు..
ABN , Publish Date - Jun 24 , 2026 | 05:35 AM
ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్న వికెట్ కీపర్ రిషభ్ పంత్ తిరిగి పాత గూటికి చేరుకున్నాడు. 2025 మెగా వేలంలో...
లఖ్‌నవూను వీడిన పంత్
డీసీకి కుల్దీప్ గుడ్‌బై
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్న వికెట్ కీపర్ రిషభ్ పంత్ తిరిగి పాత గూటికి చేరుకున్నాడు. 2025 మెగా వేలంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ అతడిని రూ.27 కోట్ల రికార్డు ధరతో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కానీ ఈ ఏడాది పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన లఖ్‌నవూ 14 మ్యాచ్‌ల్లో నాలుగే విజయాలతో అట్టడుగున నిలిచింది. అటు పంత్ బ్యాటర్‌గానూ విఫలమయ్యాడు. తాజాగా లఖ్‌నవూ-ఢిల్లీ జట్ల మధ్య స్వాప్ డీల్ జరిగింది. ఇందులో భాగంగా ఢిల్లీకి పంత్.. లఖ్‌నవూకు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మారారు. ఢిల్లీ జట్టు పంత్ ప్రస్తుత ధరలో రూ.12 కోట్ల మేర కోత పెట్టి రూ.15 కోట్లకే తీసుకోవడం గమనార్హం. ఇక కుల్దీ్‌పను మాత్రం అతడి ధరకే (రూ.13.50 కోట్లు) లఖ్‌నవూ తీసుకుంది.
ఇవి కూడా చదవండి:
భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మకు అరుదైన గౌరవం
టీ20ల్లో ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠం కైవసం చేసుకున్న శ్రీ చరణి