Share News

తండ్రి పరిస్థితి విషమం

ABN , Publish Date - Feb 25 , 2026 | 06:02 AM

టీమిండియా క్రికెటర్‌ రింకూ సింగ్‌ టీ20 ప్రపంచకప్‌ మధ్యలోనే ఇంటికి వచ్చేశాడు. రింకూ తండ్రి ఖాన్‌చంద్‌ సింగ్‌ తీవ్ర అనారోగ్యంతో నోయిడాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు....

తండ్రి పరిస్థితి విషమం

హుటాహుటిన ఇంటికి రింకూ

చెన్నై: టీమిండియా క్రికెటర్‌ రింకూ సింగ్‌ టీ20 ప్రపంచకప్‌ మధ్యలోనే ఇంటికి వచ్చేశాడు. రింకూ తండ్రి ఖాన్‌చంద్‌ సింగ్‌ తీవ్ర అనారోగ్యంతో నోయిడాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొన్నాళ్లుగా లివర్‌ క్యాన్సర్‌ (నాలుగో దశ)తో బాధపడుతున్న ఖాన్‌చంద్‌ పరిస్థితి విషమంగా ఉందని, అతనికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం జింబాబ్వేతో మ్యాచ్‌కు రింకూ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా రింకూ అంతర్జాతీయ క్రికెటర్‌ అయిన తర్వాత కూడా తండ్రి ఖాన్‌చంద్‌ గ్యాస్‌ సిలిండర్ల డెలివరీ ఉద్యోగంలో కొనసాగడం గమనార్హం. ఆయన స్వస్థలం యూపీలోని అలీగఢ్‌.

ఇవి కూడా చదవండి..

మాజీ మంత్రి మల్లారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..

కొత్త పార్టీని ప్రకటించిన శశికళ

Updated Date - Feb 25 , 2026 | 06:02 AM