రిచా సత్తా చాటినా..
ABN , Publish Date - Jun 11 , 2026 | 05:21 AM
రిచా ఘోష్ (36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68) అర్ధ సెంచరీతో అదరగొట్టినా, సహచరులెవరూ రాణించకపోవడంతో...
ముక్కోణపు వన్డే సిరీస్‌లో నేడు
భారత్ ’ఎ' X అఫ్ఘానిస్థాన్ ’ఎ’
(సోనీ నెట్‌వర్క్‌లో ఉ. 10 గం. నుంచి)
వామ్‌పలో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి
రేపటి నుంచే మహిళల టీ20 ప్రపంచకప్
కార్డిఫ్: రిచా ఘోష్ (36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68) అర్ధ సెంచరీతో అదరగొట్టినా, సహచరులెవరూ రాణించకపోవడంతో మహిళల టీ20 ప్రపంచకప్ వామప్ మ్యాచ్‌లో భారత్‌కు చుక్కెదురైంది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 5 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. తొలుత ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఓపెనర్ అమీ జోన్స్ (64), కెప్టెన్ నాట్ షివర్ బ్రంట్ (57) అర్ధ సెంచరీలు సాధించారు. డానీ గిబ్సన్ (30 నాటౌట్) అజేయంగా నిలిచింది. శ్రేయాంక పాటిల్ 2 వికెట్లు తీసింది. ఛేదనలో భారత్ 19.5 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. రిచా తర్వాత భారతి (18)ది అత్యధిక స్కోరు కావడం గమనార్హం.
ఇవి కూడా చదవండి..
అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 11 మంది చిన్నారుల మృతి..
బ్యాంకింగ్ రంగంపై ఆసక్తి.. లాభాల్లో దేశీయ సూచీలు..