Share News

బెంగళూరులో ఐదు ఐపీఎల్‌ మ్యాచ్‌లు

ABN , Publish Date - Mar 04 , 2026 | 01:50 AM

సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ మ్యాచ్‌లు ఉంటాయా? ఉండవా? అనే సందిగ్థత తొలిగింది. అక్కడ ఐదు ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడబోతున్నట్టు...

బెంగళూరులో ఐదు ఐపీఎల్‌ మ్యాచ్‌లు

బెంగళూరు: సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ మ్యాచ్‌లు ఉంటాయా? ఉండవా? అనే సందిగ్థత తొలిగింది. అక్కడ ఐదు ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడబోతున్నట్టు ఫ్రాంచైజీ వెల్లడించింది. అలాగే మరో రెండు హోం మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లోని వీర్‌ నారాయణ్‌ సింగ్‌ అంతర్జాతీయ స్టేడియంలో ఆడనుంది. గతేడాది జట్టు విజయోత్సవాల్లో భాగంగా స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చిన్నస్వామిలో క్రికెట్‌ మ్యాచ్‌లు జరగడం లేదు. రాష్ట్ర క్రికెట్‌ సంఘం అక్కడ భద్రతా ప్రమాణాలు మెరుగుపర్చడంతో కర్ణాటక ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్ 2026: సెమీస్‌కు మ్యాచ్ రెఫరీలు వీరే!

కోహ్లీ ఎప్పటికీ ఆర్సీబీని వీడడు: మో బోబాట్

Updated Date - Mar 04 , 2026 | 01:50 AM