ముంబై అవుట్
ABN , Publish Date - May 11 , 2026 | 02:31 AM
ఐదుసార్లు ఐపీఎల్ విజేత ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్ ప్లేఆఫ్స్ ఆశలకు గండిపడింది. రేసులో నిలవాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌లను కచ్చితంగా గెలవాల్సిన వేళ....
ప్లేఆఫ్స్ ఆశలు ఆవిరి
ఆఖరి బంతికి బెంగళూరు గెలుపు
రాయ్‌పూర్: ఐదుసార్లు ఐపీఎల్ విజేత ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్ ప్లేఆఫ్స్ ఆశలకు గండిపడింది. రేసులో నిలవాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌లను కచ్చితంగా గెలవాల్సిన వేళ.. ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన పోరులో చివరి బంతికి 2 వికెట్ల తేడాతో ఓడింది. దీంతో 11 మ్యాచ్‌ల్లో కేవలం 3 విజయాలతోనే ఉన్న ముంబైకి కనీసం 14 పాయింట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. దీంతో అధికారికంగానే రేసు నుంచి నిష్క్రమించింది. 6 పాయింట్లతోనే ఉన్న లఖ్‌నవూ ఆశలు కూడా ఈ ఫలితంతో గల్లంతయ్యాయి. బెంగళూరు 14 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. ముందుగా ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు చేసింది. తిలక్ వర్మ (42 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 57), నమన్ ధిర్ (32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 47) మాత్రమే రాణించారు. భువనేశ్వర్‌కు 4 వికెట్లు దక్కాయి. ఛేదనలో బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 రన్స్ చేసి గెలిచింది. క్రునాల్ పాండ్యా (46 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 73), బెథెల్ (27) ఆకట్టుకున్నారు. బాష్‌కు 4, దీపక్ చాహర్‌కు 2 వికెట్లు దక్కాయి. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా భువనేశ్వర్ నిలిచాడు.
ఆఖర్లో అదుర్స్: ఓ మాదిరి ఛేదనలో బెంగళూరు తడబడినా.. చివరి ఓవర్ హైడ్రామాలో ఉత్కంఠను అధిగమించి సూపర్ విజయాన్నందుకుంది. ఇక పవర్‌ప్లేలో 47 పరుగులే చేయడంతో పాటు కోహ్లీ (0), పడిక్కళ్ (12), కెప్టెన్ పటీదార్ (8) వికెట్లను కోల్పోయింది. ఈస్థితిలో క్రునాల్ అండగా నిలిచాడు. ముందుగా ఓపెనర్ బెథెల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. బంతికో పరుగు చొప్పున సాధించిన బెథెల్‌ను 13వ ఓవర్‌లో బాష్ అవుట్ చేశాడు. ఆ తర్వాత జితేశ్ టచ్‌లోకి వచ్చినట్టు కనిపించినా.. 16వ ఓవర్‌లో బాష్ ఆర్‌సీబీకి డబుల్ ఝలక్ ఇచ్చాడు. వరుస బంతుల్లో జితేశ్ (18), డేవిడ్ (0)లను వెనక్కిపంపాడు. అటు హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న క్రునాల్ భారీషాట్లతో చెలరేగాడు. తొడ కండరాల నొప్పితో బాధపడుతూనే 18వ ఓవర్‌లో రెండు సిక్సర్లతో జట్టును పోటీలోకి తెచ్చాడు. కానీ చివరి బంతికి తిలక్ అద్భుత క్యాచ్‌తో వెనుదిరిగాడు. 19వ ఓవర్‌లో బుమ్రా 3 పరుగులే ఇవ్వగా సమీకరణం చివరి 6 బంతుల్లో 15 రన్స్‌కు మారింది. రాజ్ బవా వేసిన ఈ ఓవర్‌లో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. షెఫర్డ్ (4) వికెట్ తీసినా బవా మూడు వైడ్లు, నోబ్ వేయడం దెబ్బతీసింది. అలాగే భువనేశ్వర్ (7 నాటౌట్) సిక్సర్ బాదగా.. ఆఖరి బంతికి రసిక్ (3 నాటౌట్) రెండు రన్స్ తీయడంతో ఆర్‌సీబీ సంబరాల్లో మునిగింది.
ఆదుకున్న తిలక్-నమన్: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇన్నింగ్స్‌లో తిలక్, నమన్ ధిర్ మినహా మరే బ్యాటర్ ఆకట్టుకోలేకపోయాడు. కొత్త బంతితో భువనేశ్వర్ ఆరంభంలోనే కీలక వికెట్లతో ముంబైని దెబ్బతీశాడు. అతడి పదునైన బంతులకు తొలి ఓవర్‌లోనే ఓపెనర్ రికెల్టన్ (2) వెనుదిరగగా.. భువీ తన తర్వాతి ఓవర్‌లో ధాటిగా ఆడుతున్న మరో ఓపెనర్ రోహిత్ (22), సూర్య(0)లను అవుట్ చేయడంతో ముంబై 28/3 స్కోరుతో ఇబ్బందుల్లో పడింది. ఈ స్థితిలో నమన్-తిలక్ జోడీ నాలుగో వికెట్‌కు 82 రన్స్ జోడించింది. 13వ ఓవర్‌లో నమన్‌ను రసిక్.. హాఫ్ సెంచరీ పూర్తి చేశాక తిలక్‌ను భువీ బౌల్డ్ చేశారు. చివరి ఐదు ఓవర్లలో ముంబై 35 పరుగులే చేసి మూడు వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది.
స్కోరుబోర్డు
ముంబై: రికెల్టన్ (సి) పటీదార్ (బి) భువనేశ్వర్ 2, రోహిత్ (సి) సుయాశ్ (బి) భువనేశ్వర్ 22, నమన్ ధిర్ (బి) రసిక్ 47, సూర్యకుమార్ (సి) కోహ్లీ (బి) భువనేశ్వర్ 0, తిలక్ (బి) భువనేశ్వర్ 57, విల్ జాక్స్ (సి) బెథెల్ (బి) షెఫర్డ్ 10, రాజ్ బవా (సి) పటీదార్ (బి) హాజెల్‌వుడ్ 16, బాష్ (నాటౌట్) 5, దీపక్ చాహర్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 166/7; వికెట్ల పతనం: 1-4, 2-28, 3-28, 4-110, 5-132, 6-155, 7-161; బౌలింగ్: భువనేశ్వర్ 4-0-23-4, హాజెల్‌వుడ్ 4-0-33-1, రసిక్ 4-0-42-1, షెఫర్డ్ 3-0-18-1, క్రునాల్ 3-0-26-0, సుయాశ్ 2-0-21-0.
బెంగళూరు: బెథెల్ (సి) తిలక్ (బి) బాష్ 26, కోహ్లీ (సి) బవా (బి) చాహర్ 0, పడిక్కళ్ (సి) రికెల్టన్ (బి) చాహర్ 12, పటీదార్ (సి) రికెల్టన్ (బి) బాష్ 8, క్రునాల్ (సి) తిలక్ (బి) ఘజన్‌ఫర్ 73, జితేశ్ (సి) నమన్ (బి) బాష్ 18, టిమ్ డేవిడ్ (సి) రికెల్టన్ (బి) బాష్ 0, షెఫర్డ్ (సి) తిలక్ (బి) బవా 4, రసిక్ (నాటౌట్) 3, భువనేశ్వర్ (నాటౌట్) 7, ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 20 ఓవర్లలో 167/8; వికెట్ల పతనం: 1-10, 2-24, 3-39, 4-94, 5-131, 6-131, 7-149, 8-157; బౌలింగ్: దీపక్ చాహర్ 4-0-33-2, బుమ్రా 4-0-20-0, కార్బిన్ బాష్ 4-1-26-4, జాక్స్ 2-0-13-0, ఘజన్‌ఫర్ 3-0-32-1, రాజ్ బవా 3-0-39-1.
ఇవి కూడా చదవండి:
రషీద్ ఖాన్ ఖాతాలో మరో అరుదైన మైలురాయి
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన పాకిస్థాన్ స్టార్ ప్లేయర్