Share News

రైజర్స్‌ రాజసంగా..!

ABN , Publish Date - Jun 24 , 2026 | 05:33 AM

రంగారెడ్డి రైజర్స్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) టీజీ20 లీగ్‌లో రెండో విజయం నమోదు చేసింది. మంగళవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రైజర్స్‌ 5 వికెట్ల తేడాతో..

రైజర్స్‌ రాజసంగా..!

మెదక్‌పై గెలుపు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): రంగారెడ్డి రైజర్స్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) టీజీ20 లీగ్‌లో రెండో విజయం నమోదు చేసింది. మంగళవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రైజర్స్‌ 5 వికెట్ల తేడాతో మెదక్‌ ఫాల్కన్స్‌పై గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన మెదక్‌ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. వికెట్‌ కీపర్‌ నాయక్‌ 49 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆల్‌రౌండర్‌ తనయ్‌ 3, కరియప్ప, జడ్డూ తలో రెండు వికెట్లు తీశారు. ఛేదనలో ఆర్‌ఆర్‌ఆర్‌ జట్టు 18.2 ఓవర్లలో 167/5 స్కోరు చేసి నెగ్గింది. రాకేష్‌ (38 నాటౌట్‌), యాదవ్‌ (28 నాటౌట్‌) ఆర్‌ఆర్‌ఆర్‌ను విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు 7 వికెట్లతో పాలమూరు స్ట్రయికర్స్‌పై గెలిచింది. తొలుత పాలమూరు 19.4 ఓవర్లలో 141కు ఆలౌట్‌ కాగా, ఛేదనలో హైదరాబాద్‌ 15.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 147 రన్స్‌ చేసి గెలిచింది.

ఇవి కూడా చదవండి:

భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మకు అరుదైన గౌరవం

టీ20ల్లో ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠం కైవసం చేసుకున్న శ్రీ చరణి

Updated Date - Jun 24 , 2026 | 05:33 AM