Share News

‘రాజస్థాన్‌’ అమ్మకం.. వార్న్‌ కుటుంబానికి జాక్‌పాట్‌!

ABN , Publish Date - Mar 26 , 2026 | 01:53 AM

ఐపీఎల్‌ ఫ్రాంచైజీ రాజస్థాన్‌ రాయల్స్‌ను విక్రయిస్తే.. ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం, దివంగత షేన్‌ వార్న్‌ కుటుంబానికి దాదాపు రూ. 460 కోట్ల జాక్‌పాట్‌ తగిలింది. ...

‘రాజస్థాన్‌’ అమ్మకం.. వార్న్‌ కుటుంబానికి జాక్‌పాట్‌!

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ ఫ్రాంచైజీ రాజస్థాన్‌ రాయల్స్‌ను విక్రయిస్తే.. ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం, దివంగత షేన్‌ వార్న్‌ కుటుంబానికి దాదాపు రూ. 460 కోట్ల జాక్‌పాట్‌ తగిలింది. వార్న్‌ ముందు చూపు వల్లే ఇదంతా జరిగిందనే టాక్‌ నడుస్తోంది. రాజస్థాన్‌ను అమెరికా టెక్‌ వ్యాపారవేత్త కల్‌ సోమానీ కన్సార్టియం రూ. 15,300 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇందులో వార్న్‌కు 3 శాతం వాటా ఉంది. 2008లో రాయల్స్‌ ఫ్రాంచైజీ కెప్టెన్‌, మెంటార్‌, క్రికెట్‌ కార్యకలాపాల పర్యవేక్షకుడిగా వార్న్‌ను ఫ్రాంచైజీ నియమించుకొంది. ఆ సమయంలో అతడు ఓ సూపర్‌ డీల్‌ కుదుర్చుకున్నాడు. తన ఫీజుతోపాటు తానాడిన ప్రతి ఏడాదికి 0.75 శాతం వాటా ఇవ్వాలనే ఒప్పందం చేసుకొన్నాడు. వార్న్‌ నాలుగు సీజన్లపాటు రాజస్థాన్‌ తరఫున ఆడడంతో.. అది మొత్తం 3 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో వార్న్‌ కుటుంబం ఆ వాటాను విక్రయిస్తే రూ. 450 నుంచి 460 కోట్ల వరకు దక్కించుకొనే అవకాశం ఉంది. అయితే, ఈ ఒప్పందానికి బీసీసీఐ ఆమోదం తీసుకోవాలి. షేన్‌ వార్న్‌ 2022లో గుండెపోటుతో మరణించాడు.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు సూపర్ స్యూస్!

ధురంధర్-2 డైలాగ్‌తో బుమ్రాకు భార్య సంజన పంచ్.. పోస్ట్ వైరల్

Updated Date - Mar 26 , 2026 | 01:53 AM