Share News

విరాట్‌ వికెట్‌ తీశాక.. కాళ్లు పట్టుకుంటా!

ABN , Publish Date - Mar 24 , 2026 | 06:03 AM

పంజాబ్‌ కింగ్స్‌కు చెందిన 18 ఏళ్ల స్పిన్నర్‌ విశాల్‌ నిషాద్‌ ఈ ఐపీఎల్‌లో తన చిరకాల కోరికను వెల్లడించాడు. ‘విరాట్‌ కోహ్లీ అంటే నాకెంతో ఇష్టం...

విరాట్‌ వికెట్‌ తీశాక..  కాళ్లు పట్టుకుంటా!

చండీగఢ్‌: పంజాబ్‌ కింగ్స్‌కు చెందిన 18 ఏళ్ల స్పిన్నర్‌ విశాల్‌ నిషాద్‌ ఈ ఐపీఎల్‌లో తన చిరకాల కోరికను వెల్లడించాడు. ‘విరాట్‌ కోహ్లీ అంటే నాకెంతో ఇష్టం. ఇప్పటిదాకా నేనతన్ని కలవలేదు. కానీ ఈ సీజన్‌ తొలి అంచె పోటీల్లో మా జట్టు రెండుసార్లు విరాట్‌ను ఎదుర్కోనుంది. ఒకవేళ నేను విరాట్‌ వికెట్‌ తీస్తే మాత్రం వెంటనే వెళ్లి అతని కాళ్లు పట్టుకుంటా. ఎందుకంటే అతనే నాకు ఆదర్శం’ అని విశాల్‌ తెలిపాడు. అంతేకాకుండా తన జెర్సీ మీద 18 నెంబర్‌ కోసం ప్రయత్నించినా అందుబాటులో లేకపోవడంతో 81తో బరిలోకి దిగబోతున్నాడు.

ఇవి కూడా చదవండి

పది కేజీల ఎల్పీజీ సిలిండర్లు.. కేంద్రం స్పందన ఏంటంటే..

మెహిదీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

Updated Date - Mar 24 , 2026 | 06:03 AM