‘ముక్కోణం విజేత పాకిస్థాన్
ABN , Publish Date - Nov 01 , 2026 | 03:39 AM
ఓపెనర్ ఫఖర్ జమాన్ (127) అద్భుత శతకంతో పాకిస్థాన్ జట్టు ముక్కోణపు వన్డే సిరీస్‌లో విజేతగా నిలిచింది...
ఫైనల్లో శ్రీలంక ఓటమి
జూ ఫఖర్ జమాన్ శతకం
లాహోర్: ఓపెనర్ ఫఖర్ జమాన్ (127) అద్భుత శతకంతో పాకిస్థాన్ జట్టు ముక్కోణపు వన్డే సిరీస్‌లో విజేతగా నిలిచింది. శనివారం శ్రీలంకతో జరిగిన ఫైనల్లో ఆతిథ్య పాక్ 3 వికెట్లతో గెలిచింది. ముందుగా లంక 50 ఓవర్లలో 325/8 స్కోరు చేసింది. ఓపెనర్ కమిందు మెండిస్ (131) సెంచరీ, పవన్ రత్నాయకె (77) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారీ ఛేదనలో ఫఖర్ జమాన్ సూపర్ ఇన్నింగ్స్‌తో పాక్ 48.3 ఓవర్లలో 331/7 స్కోరు చేసి నెగ్గింది. సయీద్ బేగ్ (74), అరాఫత్ మిన్హాస్ (61) సత్తా చాటారు. ముక్కోణపు సిరీస్ ఫైనల్లో అత్యధిక ఛేదన (326) చేసిన జట్టుగా భారత్ (2002లో ఇంగ్లండ్‌పై)తో సమంగా పాక్ నిలిచింది.