Share News

ఒక్క బంతీ పడకుండానే..

ABN , Publish Date - Feb 22 , 2026 | 05:16 AM

టీ20 వరల్డ్‌కప్‌ సూపర్‌-8 తొలి పోరుకు వరుణుడు అడ్డుపడ్డాడు. దీంతో గ్రూప్‌-2లో పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ మధ్య శనివారం జరగాల్సిన మ్యాచ్‌ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది....

ఒక్క బంతీ పడకుండానే..

వర్షంతో పాక్‌ న్యూజిలాండ్‌ మ్యాచ్‌ రద్దు

ఇరుజట్లకుచెరో పాయింట్‌

కొలంబో: టీ20 వరల్డ్‌కప్‌ సూపర్‌-8 తొలి పోరుకు వరుణుడు అడ్డుపడ్డాడు. దీంతో గ్రూప్‌-2లో పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ మధ్య శనివారం జరగాల్సిన మ్యాచ్‌ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. ఇరుజట్లకూ చెరో పాయింట్‌ లభించింది. చిరుజల్లులు పడుతుండగానే వేసిన టాస్‌లో గెలిచిన పాక్‌.. మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్‌ ఎంచుకొంది. అయితే, కొద్ది నిమిషాల్లోనే వాన జోరందుకోవడంతో స్టేడియం మొత్తాన్ని కవర్లతో కప్పేశారు. క్రమక్రమంగా పెరిగిన వర్షం.. ఎంతకూ నెమ్మదించలేదు. ఫీల్డ్‌ను కూడా పట్టాలతో కవర్‌ చేసినా.. భారీగానే నీరు వాటిపై చేరింది. రెండు గంటలపాటు వేచిచూసినా పరిస్థితుల్లో మార్పు కనిపించలేదు. ఐదు ఓవర్లపాటు ఆట కూడా కష్టంగా మారడంతో.. రాత్రి 9 గంటలా 7 నిమిషాలకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. సూపర్‌-8లో తమ తదుపరి మ్యాచుల్లో భాగంగా మంగళవారం ఇంగ్లండ్‌తో పాక్‌.. బుధవారం శ్రీలంకతో న్యూజిలాండ్‌ ఆడనున్నాయి. ఇక, వర్షం వల్ల ఈ మ్యాచ్‌ రద్దవడంతో ఇరుజట్ల సెమీస్‌ అవకాశాలపై ప్రభావం చూపించే చాన్సులున్నాయి. లంక వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని మరో మ్యాచ్‌కు ఇలాగే వరుణుడు అడ్డుతగిలినా? లేదా ఓడినా? ఆ జట్టు నాకౌట్‌ అవకాశాలు ఆవిరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇవీ చదవండి:

'ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా భారత్‌ను సందర్శించాల్సిందే'

ట్రంప్ సంచలన నిర్ణయం.. ప్రపంచం ముందుకు ఏలియన్స్ సీక్రెట్ ఫైల్స్

Updated Date - Feb 22 , 2026 | 05:16 AM