ఫిక్సింగ్ విచారణకు హాజరైన రిజ్వాన్, ఇమామ్
ABN , Publish Date - Sep 12 , 2026 | 06:08 AM
పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్లు మహ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్‌లను ఆ దేశ జాతీయ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ...
లాహోర్: పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్లు మహ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్‌లను ఆ దేశ జాతీయ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌సీసీఐఏ) విచారించింది. ఇంగ్లండ్ పర్యటనలో ఈ ఇద్దరు డ్రెస్సింగ్ రూమ్ సమాచారాన్ని ఇతరులకు చేరవేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఫిర్యాదు మేరకు శుక్రవారం నాలుగు గంటలపాటు సాగిన విచారణకు ఇద్దరు ఆటగాళ్లు హాజరయ్యారు. అలాగే ఈ ఇద్దరి నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్స్ నుంచి ఇంగ్లండ్ టూర్‌కు ముందు, వెళ్లాక జరిగిన ఆర్థిక, అనుమానాస్పద లావాదేవీల వివరాలను సేకరించారు. ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్‌లో పాక్ జట్టు టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి:
ప్రపంచ ఆర్థిక వృద్ధి కంటే రెండింతల వేగంతో 'బ్రిక్స్' వృద్ధి: మోదీ
పుతిన్-మోదీ ప్రయాణించిన కారు చలించే ఓ ఉక్కుకోట!