Share News

ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ టూర్లకు నితీశ్‌ దూరం

ABN , Publish Date - Jun 24 , 2026 | 05:40 AM

ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి తొడ కండరాల గాయం కారణంగా ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ జట్లతో జరిగే టీ20 సిరీ్‌సలకు దూరమవుతున్నట్టు...

ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ టూర్లకు నితీశ్‌ దూరం

జట్టులోకి సూర్యాన్ష్‌

న్యూఢిల్లీ: ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి తొడ కండరాల గాయం కారణంగా ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ జట్లతో జరిగే టీ20 సిరీ్‌సలకు దూరమవుతున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. అతడి స్థానంలో సూర్యాన్ష్‌ షెడ్గెను ఎంపిక చేసింది. ఇప్పటికే స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి కూడా గాయంతో ఐర్లాండ్‌ సిరీస్‌ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. అఫ్ఘాన్‌తో వన్డే సిరీస్‌ సందర్భంగా నితీశ్‌ గాయపడ్డాడు. మొదట గాయం చిన్నదే అని భావించినా ఎంఆర్‌ఐ స్కానింగ్‌లో తీవ్రత తెలిసింది. నితీశ్‌ కోలుకునేందుకు కనీసం నాలుగు వారాల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. సూర్యాన్ష్‌ ఇటీవలి ముక్కోణపు ‘ఎ’ వన్డే సిరీ్‌సలో 5 వన్డేల్లో 147 రన్స్‌తో ఆకట్టుకున్నాడు.

ఇవి కూడా చదవండి:

భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మకు అరుదైన గౌరవం

టీ20ల్లో ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠం కైవసం చేసుకున్న శ్రీ చరణి

Updated Date - Jun 24 , 2026 | 05:40 AM