నేడు ధోనీ వీడ్కోలు?
ABN , Publish Date - May 18 , 2026 | 02:56 AM
ఐపీఎల్‌లో చెన్నై అంటే ధోనీ.. ధోనీ అంటే చెన్నై. అంతలా పెనవేసుకుపోయిన ఈ బంధానికి ఇక తెరపడనుందా? అంటే.. అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్..
చెపాక్‌లో సన్‌రైజర్స్ పోరుతో బరిలోకి!
అనంతరం రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం
చెన్నై: ఐపీఎల్‌లో చెన్నై అంటే ధోనీ.. ధోనీ అంటే చెన్నై. అంతలా పెనవేసుకుపోయిన ఈ బంధానికి ఇక తెరపడనుందా? అంటే.. అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) జట్టుకు తలమానికమైన ధోనీ ఇక ఈ లీగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడన్న వార్తలు ఊపందుకున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్‌లోనూ బరిలోకి దిగని మహీ.. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నైలో జరిగే పోరులో ఆడి లీగ్‌కు పూర్తిగా గుడ్‌బై చెబుతాడని సమాచారం. సొంతగడ్డపై సీఎస్కేకిదే ఆఖరి మ్యాచ్. ఇందుకు సంబంధించి ప్రఖ్యాత వ్యాఖ్యాత హర్షా భోగ్లే కూడా ధోనీకిదే వీడ్కోలు మ్యాచ్ అన్న తరహాలో కామెంట్ చేయడం గమనార్హం. ‘సీఎస్కే, సన్‌రైజర్స్ మ్యాచ్‌లో ఒక సర్‌ప్రైజ్‌ను చూడొచ్చు. ఈ సీజన్‌లో చెపాక్ వేదికగా చెన్నైకి ఒకటే మ్యాచ్ మిగిలి ఉంది. ఇక్కడ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసే నిర్ణయం ఉండొచ్చు’ అని భోగ్లే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు