Share News

తిరగబెట్టిన గాయం ధోనీ రాక మరింత ఆలస్యం

ABN , Publish Date - Apr 27 , 2026 | 02:19 AM

చెన్నై సూపర్‌కింగ్స్‌ (సీఎస్కే)కు షాకింగ్‌ వార్తే ఇది. కాలి కండరాల గాయం నుంచి కోలుకుంటున్నాడనుకున్న ఆ జట్టు సూపర్‌స్టార్‌ ఎంఎస్‌ ధోనీ రాక మరింత...

తిరగబెట్టిన గాయం ధోనీ రాక మరింత ఆలస్యం

చెన్నై: చెన్నై సూపర్‌కింగ్స్‌ (సీఎస్కే)కు షాకింగ్‌ వార్తే ఇది. కాలి కండరాల గాయం నుంచి కోలుకుంటున్నాడనుకున్న ఆ జట్టు సూపర్‌స్టార్‌ ఎంఎస్‌ ధోనీ రాక మరింత ఆలస్యం కానుంది. ధోనీ గాయం మళ్లీ తిరగబెట్టిందని సీఎస్కే చీఫ్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ ఆదివారం వెల్లడించాడు. ప్రాక్టీస్‌ సెషన్‌ చేస్తుండగా ధోనీ కాలి కండరాల వద్దే మళ్లీ గాయమైందనీ, ఇప్పుడే అతడిని ఆడిస్తే గాయం తీవ్రమయ్యే అవకాశముందని ఫ్లెమింగ్‌ తెలిపాడు. అందుకే ఎలాంటి రిస్క్‌ తీసుకోదలచుకోవడం లేదన్నాడు. గాయం కారణంగా ఈ సీజన్‌ ఆరంభం నుంచే మ్యాచ్‌లకు దూరమైన ధోనీ.. మ్యాచ్‌ల సమయాల్లో మాత్రం జట్టు వెంటే ఉంటూ సహచరులను ఉత్సాహపరుస్తున్నాడు.

ఇవి కూడా చదవండి:

అభిషేక్ శర్మ చేతిని లాగిన లేడీ ఫ్యాన్.. వీడియో వైరల్

ఐపీఎల్ 2026: సీఎస్కేతో కీలక పోరు.. టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్

Updated Date - Apr 27 , 2026 | 02:19 AM