ధోనీ గాయంతో దాగుడుమూతలు
ABN , Publish Date - May 23 , 2026 | 02:37 AM
ఒక గాయం తర్వాత మరొకటి..వెరసి సీఎస్కే స్టార్ ఎమ్మెస్ ధోనీ ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఈసారి ఐపీఎల్‌ను ముగించాడు. అయితే ధోనీ గాయంపై సీఎస్కే యాజమాన్యం...
సీఎస్కేపై చిక్కా విమర్శలు
చెన్నై: ఒక గాయం తర్వాత మరొకటి..వెరసి సీఎస్కే స్టార్ ఎమ్మెస్ ధోనీ ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఈసారి ఐపీఎల్‌ను ముగించాడు. అయితే ధోనీ గాయంపై సీఎస్కే యాజమాన్యం దాగుడు మూతలు ఆడిందని టీమిండియా మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (చిక్కా) విమర్శించాడు. అలాకాకుండా..అతడి గాయంపై స్పష్టత ఇచ్చి, ఫలానా మ్యాచ్‌లో బరిలో దిగుతాడనో, లేదంటే లీగ్ ఆసాంతం ఆడడనో చెబితే ఫ్యాన్స్ మానసికంగా సిద్ధమయ్యేవారన్నాడు. ఇక..మహీని ప్రపంచ దిగ్గజ బ్యాటర్లలో ఒకడిగా అభివర్ణించిన శ్రీకాంత్ అతడు ఈ ఐపీఎల్‌లో ఆడకపోవడాన్ని ఎవరూ మిస్‌కాలేదని వ్యాఖ్యానించాడు. ‘నిజం చెప్పాలంటే ధోనీ ఆడకపోవడాన్ని ఎవరూ మిస్ కాలేదు. మహీ డ్రెస్సింగ్ రూమ్‌లో ఎందుకు లేడని మాత్రమే ఫ్యాన్స్ ప్రశ్నించారు. అంతేతప్ప ధోనీ మ్యాచ్‌లు ఎందుకు ఆడడంలేదని వారు అడగలేదు. ఏమైనా ధోనీ ఎరా ముగిసింది’ అని శ్రీకాంత్ అభిప్రాయడ్డాడు.
ఇవి కూడా చదవండి:
బిహార్‌కీ ఓ ఐపీఎల్ టీమ్ ఉండాలి: బిలియనీర్ అనిల్ అగర్వాల్
సీఎస్కే వైఫల్యానికి అసలు కారణం ఇదే: సెహ్వాగ్