Share News

నేడో, రేపో ధోనీకి ఫిట్‌నెస్‌ టెస్ట్‌

ABN , Publish Date - Apr 07 , 2026 | 02:51 AM

ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌కు గొప్ప ఊరట ఇచ్చే వార్త ఇది. కండర గాయంతో జట్టుకు దూరమైన....

నేడో, రేపో ధోనీకి ఫిట్‌నెస్‌ టెస్ట్‌

చెన్నై: ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌కు గొప్ప ఊరట ఇచ్చే వార్త ఇది. కండర గాయంతో జట్టుకు దూరమైన వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ ధోనీ ఒకటి రెండు రోజుల్లో ఫిట్‌నెస్‌ పరీక్షకు హాజరు కానున్నట్టు తెలిసింది. ఈ పరీక్షలో ధోనీ పాసైతే వచ్చే శనివారం ఇక్కడ ఢిల్లీతో జరిగే సీఎ్‌సకే తదుపరి మ్యాచ్‌కు మహీ బరిలో దిగనున్నాడు. కాగా.. సోమవారం నెట్స్‌లో బ్యాటింగ్‌ సాధన చేసిన ధోనీ ఎలాంటి అసౌకర్యానికి లోను కాలేదట. అయితే 44 ఏళ్ల ధోనీని ఆడించే విషయంలో సీఎ్‌సకే యాజమాన్యం తొందరపాటు ప్రదర్శించాలని భావించడం లేదు. గాయం నేపథ్యంలో మహీ జట్టుతో కలిసి ప్రయాణం చేయడం లేదు కూడా. ధోనీ గైర్హాజరీలో ఈసారి లీగ్‌ను చెన్నై దారుణంగా ప్రారంభించింది. రాజస్థాన్‌, పంజాబ్‌, బెంగళూరు జట్లతో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైంది.

ఇవి కూడా చదవండి:

అందుకే ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించా.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Apr 07 , 2026 | 02:51 AM