Share News

వేలంలో సిరాజ్‌, తిలక్‌ వర్మ టీజీ 20 క్రికెట్‌

ABN , Publish Date - Jun 04 , 2026 | 01:54 AM

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) నిర్వహిస్తున్న టీజీ20 లీగ్‌ వేలంలో భారత క్రికెటర్లు మహ్మద్‌ సిరాజ్‌, తిలక్‌ వర్మ ప్రత్యేక...

వేలంలో సిరాజ్‌, తిలక్‌ వర్మ టీజీ 20 క్రికెట్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) నిర్వహిస్తున్న టీజీ20 లీగ్‌ వేలంలో భారత క్రికెటర్లు మహ్మద్‌ సిరాజ్‌, తిలక్‌ వర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. అలాగే హైదరాబాద్‌ ఆటగాళ్లు రోహిత్‌ రాయుడు, రాహుల్‌ బుద్ధి, సీవీ మిలింద్‌, తన్మయ్‌ అగర్వాల్‌ తదితరులు కూడా బరిలో ఉంటారు. వచ్చే ఆదివారం నిర్వహించనున్న ఈ వేలంలో స్టార్‌ క్రికెటర్లతో పాటు మొత్తం 1300 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారని హెచ్‌సీఏ బుధవారం తెలిపింది. ఏ ప్లస్‌, ఏ, బి, సి, సి1, సి2 విభాగాలుగా ఆటగాళ్లను విభజించి, వేలంలో ఉంచనున్నారు. ప్రతి జట్టు తమ 20 మంది ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు గరిష్టంగా రూ.60 లక్షలను వేలంలో ఖర్చు చేయవచ్చు. ఈనెల 21నుంచి జరిగే ఈ టోర్నీలో 8 జట్లు 32 మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి.

ఇవి కూడా చదవండి:

బోర్లా పడ్డ రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన

గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం.. ఎందుకంటే..

Updated Date - Jun 04 , 2026 | 01:54 AM