Share News

స్టార్క్‌ రాక సందిగ్ధం

ABN , Publish Date - Mar 24 , 2026 | 06:05 AM

ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఐపీఎల్‌లో ఆడతాడా..లేదా..అనే విషయంలో సందిగ్ధం వీడలేదు. లీగ్‌ బరిలో దిగేందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) అతడికి...

స్టార్క్‌ రాక సందిగ్ధం

ఎన్‌వోసీ ఇవ్వడంలో సీఏ తాత్సారం

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఐపీఎల్‌లో ఆడతాడా..లేదా..అనే విషయంలో సందిగ్ధం వీడలేదు. లీగ్‌ బరిలో దిగేందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) అతడికి ‘నిరభ్యంతర ప్రతం’ ఇంకా ఇవ్వకపోవడమే అందుకు కారణం. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్గాలు సోమవా రం వెల్లడించాయి. అయితే ఏప్రిల్‌ ఒకటిన ఢిల్లీ ఆడే ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌కల్లా అతడు క్యాపిటల్స్‌తో చేరగలడన్న ఆశాభావాన్ని వ్యక్తంజేశాయి. గత సీజన్‌ 11 మ్యాచ్‌ల్లో స్టార్క్‌ 14 వికెట్లు తీశాడు. ‘క్రికెట్‌ ఆస్ట్రేలియా నుంచి ఎన్‌వోసీ కోసం ఎదురు చూస్తున్నాం. అది వస్తే..స్టార్క్‌ జట్టుతో ఎప్పుడు కలుస్తాడో తెలుస్తుంది.’ అని ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌ హేమంగ్‌ బదాని తెలిపాడు. పనిభారం నిర్వహణలో భాగంగా స్టార్క్‌కు క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎన్‌వోసీ ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నదా అన్న ప్రశ్నకు ‘అతడు వస్తున్నాడు. క్రికెట్‌ ఆస్ట్రేలియా నుంచి ఎన్‌వోసీ రావడమనేది లాంఛనమే. స్టార్క్‌ పరిస్థితిని మాతోపాటు సీఏ కూడా పర్యవేక్షిస్తున్నది’ అని ఢిల్లీ క్యాపిటల్స్‌ క్రికెట్‌ డైరెక్టర్‌ వేణుగోపాల రావు బదులిచ్చాడు. ఒకవేళ స్టార్క్‌ రాకపోతే..అతడి స్థానంలో మరో ఎడమ చేతి పేసర్‌ నటరాజన్‌ను తుది జట్టులో తీసుకొనే ఆలోచన లేదని కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ వెల్లడించాడు. కాగా..నటరాజన్‌ 100 శాతం ఫిట్‌నె్‌సతో ఉన్నాడని చెప్పాడు. భుజం గాయంతో నిరుటి ఐపీఎల్‌లో నటరాజన్‌ కేవలం రెండు మ్యాచ్‌లే ఆడాడు.

ఇవి కూడా చదవండి

పది కేజీల ఎల్పీజీ సిలిండర్లు.. కేంద్రం స్పందన ఏంటంటే..

మెహిదీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

Updated Date - Mar 24 , 2026 | 06:05 AM