Share News

అన్నదమ్ములే ఆడేశారు

ABN , Publish Date - Feb 13 , 2026 | 03:21 AM

మాస్కా బ్రదర్స్‌ ఆంథోని (62 నాటౌట్‌), జస్టిన్‌ (60 నాటౌట్‌) అజేయ అర్ధ శతకాలతో అదరగొట్టడంతో.. టీ20 వరల్డ్‌క్‌పలో ఇటలీ ఘనంగా బోణీ కొట్టింది. గ్రూప్‌-సిలో గురువారం...

అన్నదమ్ములే ఆడేశారు

  • అదరగొట్టిన మాస్కా బ్రదర్స్‌

  • ఇటలీ చేతిలో నేపాల్‌ ఓటమి

ముంబై: మాస్కా బ్రదర్స్‌ ఆంథోని (62 నాటౌట్‌), జస్టిన్‌ (60 నాటౌట్‌) అజేయ అర్ధ శతకాలతో అదరగొట్టడంతో.. టీ20 వరల్డ్‌క్‌పలో ఇటలీ ఘనంగా బోణీ కొట్టింది. గ్రూప్‌-సిలో గురువారం పసికూనల మధ్య జరిగిన పోరులో ఇటలీ 10 వికెట్ల తేడాతో నేపాల్‌ను చిత్తు చేసింది. తొలుత నేపాల్‌ 19.3 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటైంది. ఆరిఫ్‌ షేక్‌ (27), కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌ (23), ఆసిఫ్‌ (20) మాత్రమే రెండు పదుల స్కోర్లు సాధించారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ క్రిషన్‌ కలుగమాగె మూడు, బెన్‌ మానెంటి రెండు వికెట్లు దక్కించుకొన్నారు. అనంతరం ఛేదనలో ఇటలీ 12.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 124 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ జస్టిన్‌, ఆంథోని ఆరంభం నుంచే పసలేని నేపాల్‌ బౌలర్లపై విరుచుపడ్డారు. దీంతో పవర్‌ప్లేలోనే ఇటలీ 68/0తో మెరుగైన స్థితిలో నిలిచింది. వీరిద్దరిని కట్టడి చేసేందుకు నేపాల్‌ సారథి పలువురు బౌలర్లను మార్చినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన మాస్కా బ్రదర్స్‌.. మరో 44 బంతులు మిగిలుండగానే జట్టుకు భారీ విజయాన్ని అందించారు.

ఇవి కూడా చదవండి:

అరుదైన రికార్డుకు 4 వికెట్ల దూరంలో అర్ష్‌దీప్ సింగ్

కొలంబో పిచ్‌ను టీమిండియాకు అనుకూలంగా మార్చేస్తారు.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..

Updated Date - Feb 13 , 2026 | 03:21 AM