Share News

బ్యాటింగ్‌.. బ్లాక్‌బస్టర్‌

ABN , Publish Date - Mar 20 , 2026 | 06:23 AM

భారీ హిట్టర్లు.. మెరుగైన బౌలింగ్‌ విభాగంతో ఎంతటి జట్టుకైనా సవాల్‌ విసరగల టీమ్‌ లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (ఎల్‌ఎ్‌సజీ). 2022లో మెగా లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన...

బ్యాటింగ్‌..  బ్లాక్‌బస్టర్‌

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌

ప్లేఆ్‌ఫ్సపై పంత్‌ సేన గురి

షమి, మయాంక్‌తో బలంగా బౌలింగ్‌

భారీ హిట్టర్లు.. మెరుగైన బౌలింగ్‌ విభాగంతో ఎంతటి జట్టుకైనా సవాల్‌ విసరగల టీమ్‌ లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (ఎల్‌ఎ్‌సజీ). 2022లో మెగా లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన లఖ్‌నవూ తొలి రెండు సీజన్లలో ప్లేఆ్‌ఫ్సకు చేరినా.. 2024లో ఏడో స్థానానికే పరిమితమైంది. ఈ క్రమంలో కెప్టెన్‌ రాహుల్‌ను వదులుకొని.. 2025లో రిషభ్‌ పంత్‌ను రూ. 27 కోట్లకు ఖరీదు చేసినా ప్రయోజనం లేకపోయింది. మరోసారి ఆ టీమ్‌ ఏడో స్థానానికే పరిమితమైంది. అయితే, లోటుపాట్లను సరిదిద్దుకొని ఈసారి టైటిల్‌ నెగ్గాలనే పట్టుదలలో లఖ్‌నవూ ఉంది. కెప్టెన్‌ పంత్‌ అందుకు తగిన విధంగా శ్రమిస్తున్నాడు. తన బ్యాటింగ్‌తోపాటు ఫిట్‌నె్‌సపై శ్రద్ధ కనబరుస్తున్నాడు. జోస్‌ ఇన్‌గ్లి్‌స రాకతో బ్యాటింగ్‌ డెప్త్‌ పెరిగింది. షమి, అవేశ్‌ ఖాన్‌, మయాంక్‌ యాదవ్‌ పేస్‌ భారాన్ని మోయనుండగా.. హసరంగ స్పిన్‌ మాయాజాలం ప్లస్‌ కానుంది. నికోలస్‌ పూరన్‌, మిచెల్‌ మార్ష్‌, పంత్‌, మార్‌క్రమ్‌, ఆయుష్‌ బదోనితో బ్యాటింగ్‌ బలంగా కనిపిస్తోంది. జట్టు లోగోనూ కూడా సరికొత్తగా డిజైన్‌ చేశారు.

బలాలు: విధ్వంసం సృష్టించగలిగే టాపార్డర్‌. మార్‌క్రమ్‌, మార్ష్‌, ఇన్‌గ్లి్‌స, పంత్‌, పూరన్‌ నిలబడితే భారీ స్కోర్లు ఖాయం. మార్‌క్రమ్‌ జట్టులో నిలకడ తీసుకురానుండగా.. ఇన్‌గ్లి్‌స జోరు కొనసాగించనున్నాడు. మిడిలార్డర్‌లో పంత్‌, పూరన్‌ కీలకం. గత సీజన్‌తో పోల్చితే బౌలింగ్‌ విభాగం మెరుగ్గా కనిపిస్తోంది. షమి అనుభవం జట్టుకు అదనపు బలం. ఇక, మయాంక్‌ తన పేస్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను భయపెడతాడు. హసరంగ వికెట్‌ టేకర్‌. మొత్తంగా చూస్తే జట్టు సమతుల్యంగా కనిపిస్తోంది.

బలహీనతలు: అందరూ భారీ హిట్టర్లు కావడం వల్ల అంతా సాఫీగా సాగితే ఎదురుండదు. కానీ, ఏదైనా తేడా జరిగితే.. నిలబడి జట్టును ఆదుకొనే ప్లేయర్‌ ఎవరా? అని చూడాల్సిన పరిస్థితి. ఒత్తిడిని ఎదుర్కొంటూ నిలదొక్కుకోగలిగే విధంగా జట్టు తయారు కావాలి. లోయర్‌ మిడిలార్డర్‌ మరింతగా మెరుగుపడాలి. ఇక, పేసర్లు షమి, మయాంక్‌పై అతిగా ఆధారపడడం కూడా ఒక బలహీనతగా చెప్పుకోవాలి.

అంచనా: గత రెండు సీజన్లతో పోల్చితే ఈసారి లఖ్‌నవూ మెరుగైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌ దశకు చేరే అవకాశాలున్నాయి.

జట్టు:

బ్యాటర్లు: రిషభ్‌ పంత్‌ (కెప్టెన్‌), నికోలస్‌ పూరన్‌, జోష్‌ ఇన్‌గ్లి్‌స, మార్‌క్రమ్‌, హిమ్మత్‌ సింగ్‌, మాథ్యూ బ్రిజ్‌టెక్‌, అక్షత్‌ రఘువంశీ, ముకుల్‌ చౌదరి.

ఆల్‌రౌండర్లు: మిచెల్‌ మార్ష్‌, హసరంగ, బదోని, అబ్దుల్‌ సమద్‌, షాబాజ్‌ అహ్మద్‌, అర్షిన్‌ కులకర్ణి.

బౌలర్లు: షమి, మయాంక్‌, అన్రిచ్‌ నోకియా, అవేశ్‌ ఖాన్‌, సిద్దార్థ్‌, మొహిసిన్‌ ఖాన్‌, దిగ్వేష్‌ రాఠీ, ఆకాంక్ష్‌ సింగ్‌, ప్రిన్స్‌ యాదవ్‌, అర్జున్‌ టెండూల్కర్‌, నమన్‌ తివారి.


00-Sports.jpg

అమ్మో.. అంత బరువా?

అర్జున్‌ బ్యాట్‌పై పంత్‌ ఆశ్చర్యం

లఖ్‌నవూ: సచిన్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ బ్యాట్‌ను చూసి లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ షాకయ్యాడు. ఎందుకంటే.. ఈ యువ ఆల్‌రౌండర్‌ బ్యాట్‌ ఏకంగా 1220 గ్రాముల అధిక బరువుతో ఉందట. ఇది పంత్‌ బ్యాట్‌ బరువుకన్నా ఎక్కువే. ఈ ఇద్దరి బ్యాట్ల సంభాషణను ఎల్‌ఎ్‌సజీ జట్టు వీడియో ద్వారా షేర్‌ చేసింది. ‘నా బ్యాట్‌ 1220 గ్రాములుంటుంది. 1200 గ్రాములకంటే తక్కువ బరువున్న బ్యాట్‌ను నేను వాడను. పాపా (సచిన్‌) అయితే 1310-1315 గ్రాముల బరువున్న బ్యాట్‌ వాడేవాడు’ అని పంత్‌తో అర్జున్‌ అన్నాడు. అసలు ఇంత బరువున్న బ్యాట్‌తో లాభమేంటి? అన్న పంత్‌ సందేహానికి జవాబిస్తూ.. బంతిని టచ్‌ చేస్తే చాలు ఎక్కడికో పోతుందంటూ అర్జున్‌ సమాధానమిచ్చాడు. ఇటీవలే అర్జున్‌ పెళ్లి చేసుకోగా.. ఆ మర్నాడే ప్రాక్టీస్‌ కోసం జట్టుతో పాటు కలవడాన్ని పంత్‌ కొనియాడాడు.

ఇవి కూడా చదవండి..

భారత నౌకలను ఇరాన్ అడ్డుకుంటోందా.. కేంద్రం స్పందన ఏంటంటే..

మీ కళ్లు షార్ప్ అయితేనే.. ఈ ఫొటోలో పక్షిని 15 సెకెన్లలో కనిపెట్టగలరు..

Updated Date - Mar 20 , 2026 | 06:24 AM