ఐపీఎల్‌లో జరిగేవన్నీ కల్పిత వివాదాలే: లలిత్ మోదీ
ABN , Publish Date - Jun 03 , 2026 | 05:00 AM
ఐపీఎల్ సందర్భంగా మైదానం వెలుపల జరిగే వివాదాల్లో ఎక్కువభాగం కల్పితాలేనని లీగ్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ తేల్చాడు...
న్యూఢిల్లీ: ఐపీఎల్ సందర్భంగా మైదానం వెలుపల జరిగే వివాదాల్లో ఎక్కువభాగం కల్పితాలేనని లీగ్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ తేల్చాడు. వ్యూయర్‌షిప్ తగ్గినట్టు భావిస్తే మేనేజ్‌మెంట్ కావాలనే ఇలాంటి వార్తలు మీడియాలో వచ్చేలా చూస్తుందన్నాడు. ‘రేటింగ్ పడిపోతున్న ప్రతిసారీ మేమే ఏదో ఒక వివాదం సృష్టించేవాళ్లం. ఇందులో భాగంగా అప్పట్లో ఐపీఎల్‌లో ఆడుతున్న ఒక దక్షిణాఫ్రికా కెప్టెన్‌కు చీర్‌లీడర్‌తో ఎఫైర్ ఉందనే వార్తను నేనే వ్యాప్తి చేశా. దీంతో టోర్నీ రేటింగ్స్ గణనీయంగా మెరుగయ్యాయి. ఆ తర్వాత అతను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు’ అని ఓ ఇంటర్వ్యూలో లలిత్ మోదీ స్పష్టం చేశాడు.
ఇవి కూడా చదవండి:
జమ్మూకశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ భారత టెస్ట్ జట్టుకు ఎంపికలో ట్విస్ట్!
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ యజమానిపై లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు
ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన విరాట్ జంట