దావూద్ గ్యాంగ్ బెదిరింపుల వల్లే...
ABN , Publish Date - Jun 05 , 2026 | 04:23 AM
అండర్ వరల్డ్ మాఫియా ఐపీఎల్‌ను నియంత్రించాలనుకొందని లీగ్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ సంచలన విషయాలు బయటపెట్టాడు. క్రికెట్‌నుంచి తాను..
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ మాఫియా ఐపీఎల్‌ను నియంత్రించాలనుకొందని లీగ్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ సంచలన విషయాలు బయటపెట్టాడు. క్రికెట్‌నుంచి తాను తప్పుకోవడానికి దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ బెదిరింపులే ప్రధాన కారణమన్నాడు. ఫిక్సింగ్‌లో నష్టపోయామంటూ భారీ ఎత్తున బలవంతపు వసూళ్ల యత్నంతోపాటు తన కుమారుడిని కూడా సిండికేట్ కిడ్నాప్ చేసిందని తెలిపాడు. ‘ఓసారి లండన్‌లో ఉన్నప్పుడు దావూద్ నేరుగా నాకు ఫోన్ చేసి ‘ఇక నీ పనై పోయింది’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడ’ని మోదీ చెప్పాడు. సార్వత్రిక ఎన్నికల కారణంగా 2009 లీగ్‌ను సౌతాఫ్రికాకు తరలించారు. అయితే, ఈ నిర్ణయంతో బెట్టింగ్ మాఫియాకు భారీ నష్టం వాటిల్లడంతో.. ఆ లోటును తానే భర్తీచేయాలని వేధించేవారని పేర్కొన్నా డు. ఫ్రాంచైజీలను కూడా దావూద్ గ్యాంగ్ గుప్పిట్లో పెట్టుకొని ఐపీఎల్‌ను నియంత్రించాలనుకొందని కూడా చెప్పా డు. దీంతో ముంబైలోని తన ఇంటి బయట, జొహాన్నె్‌సబర్గ్, క్రొయేషియా శివార్లలో హత్యాయత్నాలు జరిగాయని మోదీ చెప్పాడు. అండర్ వరల్డ్ హిట్ లిస్ట్ నుంచి బయటపడేందుకు.. క్రికెట్ కార్యకలాపాల నుంచి పూర్తిగా రిటైరయ్యే విధంగా ఒప్పందం కుదుర్చుకొన్నానన్నాడు.
ఇవి కూడా చదవండి:
టెస్ట్ క్రికెట్ కోసం ఐపీఎల్ తరహా ప్రణాళికను అందించిన లలిత్ మోదీ
సూర్యకుమార్‌కు బిగ్ షాక్.. టీమిండియాకు కొత్త కెప్టెన్!