కేఎస్ భరత్ రిటైర్మెంట్
ABN , Publish Date - Jun 05 , 2026 | 04:27 AM
భారత వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కెరీర్‌లో తనకు అండగా నిలిచిన బీసీసీఐ, ఆంధ్ర క్రికెట్ సంఘం,...
న్యూఢిల్లీ: భారత వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కెరీర్‌లో తనకు అండగా నిలిచిన బీసీసీఐ, ఆంధ్ర క్రికెట్ సంఘం, కోచ్‌లు, సహచర ఆటగాళ్లు, కుటుంబసభ్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 32 ఏళ్ల భరత్ టీమిండియా తరఫున ఏడు టెస్టుల్లో 221 పరుగులు, 18 క్యాచ్‌లు, ఒక స్టంపౌట్ చేశాడు. 2023 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తను అరంగేట్రం చేశాడు. అయితే సుదీర్ఘ ఫార్మాట్‌లో నిలకడగా స్థానం దక్కించుకోలేకపోయాడు. 2024 ఫిబ్రవరిలో తన సొంతగడ్డ విశాఖలోనే ఆఖరి టెస్టు ఆడాడు. 113 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన భరత్ 11 శతకాలతో 6102 రన్స్ సాధించాడు. రంజీల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. అలాగే ఐపీఎల్‌లో ఆర్‌సీబీ, గుజరాత్, కేకేఆర్ తరఫున 10 మ్యాచ్‌లాడాడు.
ఇవి కూడా చదవండి:
టెస్ట్ క్రికెట్ కోసం ఐపీఎల్ తరహా ప్రణాళికను అందించిన లలిత్ మోదీ
సూర్యకుమార్‌కు బిగ్ షాక్.. టీమిండియాకు కొత్త కెప్టెన్!