నా పోరాటానికి.. ఇదే నిదర్శనం
ABN , Publish Date - May 12 , 2026 | 02:50 AM
ముంబైతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఆల్‌రౌండర్ క్రునాల్ పాండ్యా (73) అర్ధ శతకంతో జట్టు విజయంలో...
న్యూఢిల్లీ: ముంబైతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఆల్‌రౌండర్ క్రునాల్ పాండ్యా (73) అర్ధ శతకంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ సమయంలో క్రునాల్ కండర గాయాలతో పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బందిపడినా.. భారీ షాట్లతో ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు. మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి లోనైన క్రునాల్.. తన పొట్టపై ఏర్పడిన గాయం మచ్చతో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ‘మన పోరాటం ఎంత గొప్పదో చెప్పడానికి కొన్ని మచ్చలు నిదర్శనం. ఇదిగో సాక్ష్యం’ అంటూ.. క్రునాల్ తన పొట్ట పై భాగంలో ఎడమవైపు కందిపోయిన చర్మం ఫొటోను పోస్ట్ చేశాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ ఫైనల్స్: అహ్మదాబాద్ స్టేడియానికే ఎందుకింత ప్రాధాన్యం?
భువీని భారత జట్టులోకి తీసుకురావాలి: రవిచంద్రన్ అశ్విన్