Share News

రఘువంశీపై జరిమానా

ABN , Publish Date - Apr 28 , 2026 | 02:38 AM

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్యాటర్‌ రఘువంశీపై 20శాతం జరిమానా విధించారు. లఖ్‌నవూతో మ్యాచ్‌ సందర్భంగా...

రఘువంశీపై జరిమానా

లఖ్‌నవూ: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్యాటర్‌ రఘువంశీపై 20శాతం జరిమానా విధించారు. లఖ్‌నవూతో మ్యాచ్‌ సందర్భంగా అతడిని థర్డ్‌ అంపైర్‌ అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌ అవుట్‌గా ప్రకటించారు. దీంతో అసహనానికి గురైన రఘువంశీ మైదానం వీడే క్రమంలో బౌండరీ లైన్‌ను బ్యాట్‌తో కొట్టి, హెల్మెట్‌ను డగౌట్‌లోకి విసిరేశాడు. ఇలా క్రీడా వస్తువులను అగౌరవపర్చడం ఆర్టికల్‌ 2.2 లెవెల్‌ 1 రూల్‌ను అతిక్రమించినట్టవుతుంది. అందుకే అతడిపై జరిమానాతో పాటు ఓ డీమెరిట్‌ పాయింట్‌ను కూడా చేర్చారు.

ఇవి కూడా చదవండి:

అతడిని ల్యాబ్‌కు తీసుకెళ్లి పరీక్షించాలి.. వైభవ్‌పై పాక్ క్రికెట్ అనలిస్ట్ ప్రశంసలు

మూడేళ్ల నాటి సెహ్వాగ్‌ సవాల్‌.. బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చిన రింకు సింగ్!

Updated Date - Apr 28 , 2026 | 02:44 AM