Share News

ట్రోఫీని గుడికి తీసుకెళ్లడమేంటి?

ABN , Publish Date - Mar 11 , 2026 | 03:31 AM

వరల్డ్‌కప్‌ ట్రోఫీని హనుమాన్‌ దేవాలయానికి తీసుకెళ్లడంపై మాజీ ఆటగాడు, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ కీర్తి ఆజాద్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ ట్రోఫీ...

ట్రోఫీని గుడికి తీసుకెళ్లడమేంటి?

  • మసీదు, చర్చికి కూడా తీసుకెళ్తారా?

  • కప్పు 140 కోట్ల ప్రజలది.. ఏ ఒక్కరిదో కాదు

  • కీర్తి ఆజాద్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: వరల్డ్‌కప్‌ ట్రోఫీని హనుమాన్‌ దేవాలయానికి తీసుకెళ్లడంపై మాజీ ఆటగాడు, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ కీర్తి ఆజాద్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ ట్రోఫీ ఏ ఒక్క మతానికో చెందినది కాదని, 140 కోట్ల మంది భారతీయులదన్నాడు. ‘టీమిండియా సిగ్గుపడాల్సిన విషయం. 1983లో కపిల్‌దేవ్‌ సారథ్యంలో మేం వన్డే వరల్డ్‌కప్‌ గెలిచినప్పుడు.. జట్టులో హిందువులు, సిక్కులు, ముస్లింలు, క్రిస్టియన్లు ఉన్నారు. టోర్నీని మాతృభూమి ఇండియాకి తీసుకొచ్చామేగానీ చర్చి, మసీదు, గురుద్వారాలకు తీసుకెళ్లలేదు. ఈ భారత జట్టు సూర్యకుమార్‌ లేదా జైషా కుటుంబానిది కాదు. ట్రోఫీని సిరాజ్‌ మసీదులోకి, సంజూ చర్చిలోకి తీసుకెళ్లలేదు. ఈ ట్రోఫీ 140 కోట్ల భారత ప్రజలది.. అంతేకానీ ఏ ఒక్క మతానిదో కాదు’ అని ఎక్స్‌లో పోస్టు చేశాడు. ఆజాద్‌ వ్యాఖ్యలను మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ఖండించాడు. కీర్తి ప్రతీదాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నాడని విమర్శించాడు.

ఇవి కూడా చదవండి:

చిన్ననాటి స్నేహితురాలితో కుల్‌దీప్ యాదవ్ వివాహం.. ఎప్పుడంటే!

డారిల్ మిచెల్‌తో గొడవ.. అర్ష్‌దీప్ సింగ్‌పై చర్యలు తీసుకున్న ఐసీసీ

Updated Date - Mar 11 , 2026 | 03:31 AM