కేన్ విలియమ్సన్ వీడ్కోలు
ABN , Publish Date - Jun 13 , 2026 | 01:42 AM
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఓవైపు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ జరుగుతుండగానే.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు...
ఇంగ్లండ్‌తో సిరీస్ మధ్యలోనే నిర్ణయం
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఓవైపు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ జరుగుతుండగానే.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించాడు. ఆట నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్టు తెలిపాడు. దీంతో లార్డ్స్‌లో ముగిసిన తొలి టెస్టే అతడి కెరీర్‌లో ఆఖరిదైంది. విలియమ్సన్ 16 ఏళ్ల కెరీర్‌లో 110 టెస్టుల్లో 33 శతకాలతో 9515 పరుగులు, 175 వన్డేల్లో 15 శతకాలతో 7256 రన్స్, 93 టీ20ల్లో 2575 రన్స్ చేశాడు. కివీస్ కెప్టెన్‌గా 40 టెస్టులు, 91 వన్డేలు, 75 టీ20ల్లో జట్టును నడిపించాడు. తన నాయకత్వంలో కివీస్ వరల్డ్ టెస్టు చాంపియన్‌షి్‌పతో పాటు 2019 వన్డే వరల్డ్‌కప్, 2021 టీ20 వరల్డ్‌కప్‌లో రన్నర్‌పగా నిలిచింది. ఐపీఎల్‌లోనూ సన్‌రైజర్స్ కెప్టెన్‌గా జట్టును ఫైనల్‌కు చేర్చగా.. 2016లో విజేతగా నిలిచిన జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. కాగా, గతేడాది నవంబరులోనే కేన్ టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే.
కోహ్లీ భావోద్వేగం
ఇన్నేళ్లలో ఒక ప్రత్యర్థినుంచి స్నేహితుడిగా మారావు. నీ ఆటను చూడడంతోపాటు ప్రత్యర్థిగా నీతో తలపడడాన్ని ఎంతో ఆస్వాదించా. వీటన్నింటికంటే మన స్నేహాన్ని ఎంతో గౌరవిస్తా. ఆటగాడిగా నువ్వు చేయాల్సింది చేసేశావు. వెల్‌డన్.. ఇక నీ అసలైన జీవితం ఇప్పుడే మొదలైంది.
- కేన్ రిటైర్మెంట్‌పై ‘ఎక్స్’లో విరాట్ కోహ్లీ
ఇవి కూడా చదవండి:
సచిన్, కోహ్లీని వైభవ్ అధిగమిస్తాడు: డేల్ స్టెయిన్