ప్చ్..ఐపీఎల్
ABN , Publish Date - Mar 20 , 2026 | 06:12 AM
ఇటీవలి కాలంలో ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లకు ఆదరణ పెరిగింది. ముఖ్యంగా ఐపీఎల్‌కున్న పేరు ప్రతిష్ఠలు అంతా ఇంతా కావు. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్‌గా...
టాప్-10 క్రికెట్ లీగ్‌లలో మూడోస్థానంతో సరి
లండన్: ఇటీవలి కాలంలో ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లకు ఆదరణ పెరిగింది. ముఖ్యంగా ఐపీఎల్‌కున్న పేరు ప్రతిష్ఠలు అంతా ఇంతా కావు. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్‌గా ఖ్యాతి గడించింది. అయితే క్రికెటర్లకు సంబంధించిన హక్కులు, భద్రత, వివాదాల పరిష్కారం వంటి పలు అంశాల్లో మాత్రం వెనుకంజలోనే ఉంది. అందుకే ప్రపంచ క్రికెటర్ల సంఘం (డబ్ల్యూసీఏ) ప్రకటించిన టాప్-10 క్రికెట్ లీగ్‌ల ర్యాంకుల్లో ఐపీఎల్‌కు మూడో స్థానం మాత్రమే దక్కింది. వీరి జాబితా ప్రకారం ది హండ్రెడ్ (ఇంగ్లండ్), ఎస్‌ఏ టీ 20 (దక్షిణాఫ్రికా) టాప్-2లో ఉన్నాయి. ఇక బిగ్ బాష్, పాక్ క్రికెట్ లీగ్ 4, 5 స్థానాల్లో నిలిచాయి. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌కు పదో స్థానం దక్కింది. ఈ ర్యాంకుల ప్రక్రియలో మొత్తం 13 అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఐపీఎల్‌కు సంబంధించి లభించే భారీ పేమెంట్లు, అలాగే గత రెండేళ్లలో డబ్బు ఎగవేతలు ఏమీ లేకపోవడం ప్లస్ పాయింట్లుగా నిలిచాయి.
ఇవి కూడా చదవండి..
భారత నౌకలను ఇరాన్ అడ్డుకుంటోందా.. కేంద్రం స్పందన ఏంటంటే..
మీ కళ్లు షార్ప్ అయితేనే.. ఈ ఫొటోలో పక్షిని 15 సెకెన్లలో కనిపెట్టగలరు..