డగౌట్‌లో ఫోన్ వాడిన రాజస్థాన్ మేనేజర్‌కు జరిమానా
ABN , Publish Date - Apr 18 , 2026 | 02:25 AM
ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా డగౌట్‌లో ఫోన్ వాడి నిబంధనల్ని ఉల్లంఘించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మేనేజర్ రోమి భిందర్‌పై రూ. లక్ష జరిమానా...
న్యూఢిల్లీ: ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా డగౌట్‌లో ఫోన్ వాడి నిబంధనల్ని ఉల్లంఘించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మేనేజర్ రోమి భిందర్‌పై రూ. లక్ష జరిమానా విధించారు. తొలి తప్పిదం కావడంతో రోమిపై నిషేధం విధించకుండా కేవలం జరిమానాతో సరిపెట్టినట్టు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా శుక్రవారం వెల్లడించారు. ఈనెల 10న గువాహటిలో బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా రోమి మొబైల్ వాడారు.
ఇవి కూడా చదవండి:
గుజరాత్‌పై వరుణ్ చక్రవర్తి విజృంభణ చూస్తాం: కార్తిక్ త్యాగి