ఐపీఎల్ కెప్టెన్ల భేటీలో ‘ఇంపాక్ట్’పైనే అభ్యంతరాలు
ABN , Publish Date - Mar 26 , 2026 | 01:46 AM
ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను తీసుకొచ్చినప్పటి నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం జరిగిన ఐపీఎల్ సారథుల...
ముంబై: ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను తీసుకొచ్చినప్పటి నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం జరిగిన ఐపీఎల్ సారథుల సమావేశంలో కూడా మెజార్టీ కెప్టెన్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను బీసీసీఐ 2023లో ప్రవేశపెట్టింది. అనంతరం ఈ రూల్‌ను 2027 వరకు పొడిగించింది. అయితే, తాజాగా జరిగిన సమావేశంలో కూడా 10 జట్ల సారథులు ఈ రూల్‌పై మరోసారి సుదీర్ఘంగా చర్చించారు. ‘ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై కెప్టెన్లు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను తెలియజేశారు. అయితే, 2027 ఎడిషన్ వరకు ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదని స్పష్టం చేశాం’ అని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో 10 ఓవర్ల తర్వాత మరో కొత్త బంతిని ఇచ్చే అవకాశాలను పరిశీలించాలని ఓ జట్టు సారథి కోరాడట. మంచు ప్రభావం తగ్గించేందుకు రెండో ఇన్నింగ్స్‌లో 10 ఓవర్ల తర్వాత బంతి మార్చే అవకాశం ప్రస్తుతం ఉంది. ఇక, ప్రాక్టీస్ మార్గదర్శకాలపై మరింత స్పష్టత ఇవ్వాలని సన్‌రైజర్స్ తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ అడిగాడని తెలిసింది. కొత్త నిబంధన ప్రకారం మ్యాచ్ రోజు ప్రాక్టీ్‌సకు అనుమతి లేదు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు సూపర్ స్యూస్!
ధురంధర్-2 డైలాగ్‌తో బుమ్రాకు భార్య సంజన పంచ్.. పోస్ట్ వైరల్