Share News

ఎలిస్‌, కర్రాన్‌ అవుట్‌

ABN , Publish Date - Mar 20 , 2026 | 06:07 AM

ఐపీఎల్‌ ఆరంభానికి ముం దు చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎ్‌సకే)కు గట్టిదెబ్బ తగిలింది. ఆ జట్టు కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా పేసర్‌ నాథన్‌ ఎలిస్‌ తొడ కండర గాయంతో...

ఎలిస్‌, కర్రాన్‌ అవుట్‌

గాయాలతో ఐపీఎల్‌కు దూరం

చెన్నై: ఐపీఎల్‌ ఆరంభానికి ముం దు చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎ్‌సకే)కు గట్టిదెబ్బ తగిలింది. ఆ జట్టు కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా పేసర్‌ నాథన్‌ ఎలిస్‌ తొడ కండర గాయంతో లీగ్‌ మొత్తానికే దూరమైనట్టు చెన్నై ఫ్రాంచైజీ గురువారం ప్రకటించింది. కాగా, రాజస్థాన్‌ రాయల్స్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కర్రాన్‌ కూడా గాయంతో మెగా లీగ్‌కు దూరం కానున్నట్టు సమాచారం. అతడికి గజ్జల్లో గాయమైనట్టు తెలుస్తోంది. చెన్నై నుంచి కర్రాన్‌ను రాజస్థాన్‌ ట్రేడింగ్‌లో కొనుగోలు చేసింది. మరోవైపు పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాడు లూకీ ఫెర్గూసన్‌ కూడా తొలి 7 మ్యాచ్‌లు ఆడబోవడం లేదు. ఈ న్యూజిలాండ్‌ పేసర్‌ వ్యక్తిగత కారణాలతో దూరం కానున్నట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి..

భారత నౌకలను ఇరాన్ అడ్డుకుంటోందా.. కేంద్రం స్పందన ఏంటంటే..

మీ కళ్లు షార్ప్ అయితేనే.. ఈ ఫొటోలో పక్షిని 15 సెకెన్లలో కనిపెట్టగలరు..

Updated Date - Mar 20 , 2026 | 06:07 AM