Share News

ఐపీఎల్‌ పూర్తి షెడ్యూల్‌ వచ్చేసింది

ABN , Publish Date - Mar 27 , 2026 | 02:19 AM

పీఎల్‌ రెండోదశ షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఏప్రిల్‌ 13న ఈ అంచె మొదలై మే 24న ముగియనుంది.ఈ మేరకు లీగ్‌ రెండోదశ పోటీల వివరాలను...

ఐపీఎల్‌ పూర్తి షెడ్యూల్‌ వచ్చేసింది

ఏప్రిల్‌ 12 నుంచి రెండో దశ

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ రెండోదశ షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఏప్రిల్‌ 13న ఈ అంచె మొదలై మే 24న ముగియనుంది.ఈ మేరకు లీగ్‌ రెండోదశ పోటీల వివరాలను వెల్లడించింది. లీగ్‌ తొలి అంచెను ఈనెల 28 నుంచి ఏప్రిల్‌ 12 వరకు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. మొదటి దశ షెడ్యూల్‌ను బీసీసీఐ ఇంతకుముందే ప్రకటించింది. ఇక బెంగళూరులో శనివారం జరిగే లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు ఢీకొననున్నాయి. ఫైనల్‌ మే 31న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం లో జరగనుంది. ‘లీగ్‌ రెండో దశలో 50 మ్యా చ్‌లను వచ్చేనెల 13 నుంచి మే 24 వరకు 12 వేదికల్లో నిర్వహించనున్నాం’ అని బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జీత్‌ సైకియా తెలిపారు.

రెండో దశ పోటీలు ఈ వేదికల్లో..

బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, లఖ్‌నవూ, జైపూర్‌, ధర్మశాల, రాయ్‌పూర్‌, న్యూ చండీగ ఢ్‌లో జరుగుతాయి. రెండో అంచె మొదటి మ్యాచ్‌కు హైదరాబాద్‌ వేదిక కానుంది. ఆ పోరులో సన్‌రైజర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ఢీకొంటాయి. రెండో దశలో ఎనిమిది డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లున్నాయి. పంజాబ్‌ కింగ్స్‌ తమ స్వస్థల మ్యాచ్‌లను న్యూచండీగఢ్‌, ధర్మశాలలో ఆడనుంది. ప్లేఆఫ్‌ మ్యాచ్‌ల వేదికలను తర్వాత ప్రకటిస్తారు.

ఇవి కూడా చదవండి:

ప్రీతి జింటా నాకు సారీ చెప్పింది: ఆర్సీబీ ప్లేయర్

Updated Date - Mar 27 , 2026 | 02:19 AM