శ్రీచరణి, అరుంధతికి చోటు
ABN , Publish Date - Jul 01 , 2026 | 05:37 AM
ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన భారత మహిళల జట్టులో తెలుగమ్మాయిలు శ్రీచరణి, అరుంధతికి చోటు లభించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో ఆసియాడ్‌కు...
ఆసియాడ్ మహిళల జట్టు ఎంపిక
న్యూఢిల్లీ: ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన భారత మహిళల జట్టులో తెలుగమ్మాయిలు శ్రీచరణి, అరుంధతికి చోటు లభించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో ఆసియాడ్‌కు ఎంపిక చేసిన జట్టును సెలెక్టర్లు మంగళవారం ప్రకటించారు. ఈ మధ్యే ప్రపంచ నెంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లిన ఆంధ్ర బౌలర్ శ్రీచరణి, హైదరాబాద్ పేసర్ అరుంధతికి బెర్తులు దక్కాయి. ఇక యాస్తిక భాటియాపై వేటుపడగా.. ఆమె స్థానంలో కమలిని జట్టులోకి వచ్చింది. జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ, జెమీమా, దీప్తి శర్మ, రిచా ఘోష్, కమలిని, భార్తీ ఫుల్మాలి, శ్రీచరణి, రేణుక, క్రాంతి గౌడ్, అరుంధతి, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, నందిని శర్మ.
ఇవి కూడా చదవండి
అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు.. మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లపై నిషేధం
ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ విఫలం: హరీశ్ రావు