Share News

అమ్మాయిల ఫ్లాప్‌ షో

ABN , Publish Date - Feb 25 , 2026 | 06:00 AM

బ్యాటర్ల వైఫల్యంతో.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను భారత మహిళల జట్టు ఓటమితో ఆరంభించింది. మంగళవారం జరిగిన తొలి వన్డేలో వరల్డ్‌ చాంప్‌ భారత్‌ 6 వికెట్ల తేడాతో ఆసీస్‌ చేతిలో చిత్తయింది....

అమ్మాయిల ఫ్లాప్‌ షో

  • మంధాన, హర్మన్‌ అర్ధ శతకాలు వృథా

  • తొలి వన్డేలో ఓడిన భారత్‌

  • అలవోకగా నెగ్గిన ఆసీస్‌

రాణించిన మూనీ, హీలీ

బ్రిస్బేన్‌: బ్యాటర్ల వైఫల్యంతో.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను భారత మహిళల జట్టు ఓటమితో ఆరంభించింది. మంగళవారం జరిగిన తొలి వన్డేలో వరల్డ్‌ చాంప్‌ భారత్‌ 6 వికెట్ల తేడాతో ఆసీస్‌ చేతిలో చిత్తయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొన్న భారత్‌ 48.3 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. స్మృతి మంధాన (58), హర్మన్‌ప్రీత్‌ (53) అర్ధ శతకాలు చేశారు. గార్డ్‌నర్‌ మూడు, మేగన్‌ షట్‌ రెం డు వికెట్లు పడగొట్టారు. ఓపెనర్‌ ప్రతీక రావల్‌ (0) డకౌట్‌ కాగా.. షషాలీ వర్మ (4), జెమీమా రోడ్రిగ్స్‌ (8) స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌ చేరారు. ఆఖర్లో తెగించి ఆడిన గౌతమ్‌ టీమ్‌కు గౌరవప్రద స్కోరు అందించింది. ఛేదనలో ఆసీస్‌ 38.2 ఓవర్లలో 217/4 స్కోరు చేసి గెలిచింది. బెత్‌ మూనీ (76), అలిస్సా హీలీ (50), అనబెల్‌ సదర్లాండ్‌ (48 నాటౌట్‌) రాణించారు. శ్రీచరణి రెండు వికెట్లు పడగొట్టింది.

హర్మన్‌కు గాయం: కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ మోకాలికి గా యమైంది. బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో 38వ ఓవర్‌లో మేగన్‌ బౌలింగ్‌లో హర్మన్‌ ఎడమ కాలికి దెబ్బ తగిలింది. అయినా, నొప్పితోనే ఆమె బ్యాటింగ్‌ కొనసాగించింది. ఆసీస్‌ బ్యాటింగ్‌ సమయంలో హర్మన్‌ ఫీల్డింగ్‌కు రాలేదు.

ఇవి కూడా చదవండి..

మాజీ మంత్రి మల్లారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..

కొత్త పార్టీని ప్రకటించిన శశికళ

Updated Date - Feb 25 , 2026 | 06:00 AM