Share News

బ్యాటర్లు విఫలం

ABN , Publish Date - Apr 28 , 2026 | 02:52 AM

నాలుగో టీ20లో పర్లేదనిపించిన బ్యాటర్లు సిరీస్‌ చివరి మ్యాచ్‌లో మళ్లీ విఫలమయ్యారు. ముఖ్యంగా టాపార్డర్‌...

బ్యాటర్లు విఫలం

ఆఖరి టీ20లో భారత్‌ ఓటమి

బెనోని (దక్షిణాఫ్రికా): నాలుగో టీ20లో పర్లేదనిపించిన బ్యాటర్లు సిరీస్‌ చివరి మ్యాచ్‌లో మళ్లీ విఫలమయ్యారు. ముఖ్యంగా టాపార్డర్‌ తేలిపోవడంతో దక్షిణాఫ్రికాతో సోమవారం జరిగిన ఐదో టీ20లో భారత మహిళలకు 23 పరుగులతో పరాజయం తప్పలేదు. ఇక ఈ మ్యాచ్‌ విజయంతో సఫారీలు 4-1తో సిరీ్‌సను దక్కించుకున్నారు. తొలుత దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 155/6 స్కోరు చేసింది. కెప్టెన్‌ వోల్వార్ట్‌ సిరీ్‌సలో తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ 92 పరుగులతో భళా అనిపించింది. ఆపై సునె లుస్‌ (23) మినహా ఇతర బ్యాటర్లు రాణించలేకపోయారు. రేణుకా సింగ్‌, శ్రీచరణి, దీప్తీశర్మ తలా రెండు వికెట్లు పడగొట్టారు. మోస్తరు ఛేదనలో భారత్‌ 20 ఓవర్లలో 132/8 స్కోరుకే పరిమితమై ఓడింది. భారతీ ఫుల్మాలీ (40), రిచా ఘోష్‌ (25 నాటౌట్‌), కెప్టెన్‌ హర్మన్‌ (22) మాత్రమే రాణించారు. ఎంలాబ, డిక్లెర్క్‌ చెరో రెండు వికెట్లు సాధించారు.

ఇవి కూడా చదవండి:

అతడిని ల్యాబ్‌కు తీసుకెళ్లి పరీక్షించాలి.. వైభవ్‌పై పాక్ క్రికెట్ అనలిస్ట్ ప్రశంసలు

మూడేళ్ల నాటి సెహ్వాగ్‌ సవాల్‌.. బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చిన రింకు సింగ్!

Updated Date - Apr 28 , 2026 | 02:52 AM