లార్డ్స్‌లో భారతీయం
ABN , Publish Date - Jul 14 , 2026 | 05:14 AM
ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో టెస్ట్ మ్యాచ్ ఆడాలనేది ప్రతి క్రికెటర్ కల..ఇక ఆ మ్యాచ్‌లో శతకం కొడితే, ఐదు వికెట్లు సాధిస్తే, అన్నింటికీ మించి విజయం అందుకొంటే, అది కూడా అత్యద్భుతమైన...
ఏకైక టెస్ట్‌లో
చారిత్రక విజయం 270 పరుగులతో ఇంగ్లండ్ చిత్తు
ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో టెస్ట్ మ్యాచ్ ఆడాలనేది ప్రతి క్రికెటర్ కల..ఇక ఆ మ్యాచ్‌లో శతకం కొడితే, ఐదు వికెట్లు సాధిస్తే, అన్నింటికీ మించి విజయం అందుకొంటే, అది కూడా అత్యద్భుతమైన భారీ విజయం అయితే..ఇక ఆ క్రీడాకారిణులకు, జట్టుకు అది ఓ జీవితకాల మధురానుభూతి..సరిగ్గా అలాంటి అనుభూతినే అనుభవిస్తోంది హర్మన్‌కౌర్ కెప్టెన్సీలోని భారత్..లార్డ్స్‌లో తొలిసారి జరిగిన మహిళల టెస్ట్‌లో మనోళ్లు ఆతిథ్య ఇంగ్లండ్‌ను ఏకంగా 270 పరుగులతో చిత్తు చేశారు..మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో పేసర్ క్రాంతి గౌడ్ ఐదు వికెట్లతో ప్రత్యర్థిని గడగడలాడిస్తే, రెండో ఇన్నింగ్స్‌లో యాస్తికా భాటియా శతకం చేయడం ఈ టెస్ట్‌లో కీలక ఘట్టాలు..టీ20 ప్రపంచ కప్ గ్రూప్ దశలోనే నిష్క్రమించి నిరాశ పరిచిన టీమిండియా లార్డ్స్‌లో అపురూప విజయంతో దేశ క్రికెట్ అభిమానులకు గర్వకారణంగా నిలిచింది.
లండన్: ఆల్‌రౌండ్ ప్రదర్శనకు అర్థం చెబుతూ భారత జట్టు అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రఖ్యాత లార్డ్స్ గ్రౌండ్‌లో చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్‌తో ఏకైక టెస్ట్‌లో 270 పరుగుల ఘన విజయంతో మురిసింది. విజయానికి కావాల్సిన నాలుగు వికెట్లను చివరి రోజు గంటన్నర ఆటలోనే పడగొట్టింది. 457 పరుగుల అలవిమాలిన లక్ష్యంతో..కిందటిరోజు 130/6 స్కోరుతో..చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 186 పరుగులకు ఆలౌటైంది. తన ఓవర్‌నైట్ స్కోరు 52కి అమీ జోన్స్ మరో రెండు పరుగులే జోడించి స్నేహ్ రాణా బౌలింగ్‌లో అవుటైంది. మరోవైపు క్రాంతి గౌడ్ రెండు క్యాచ్‌లు వదిలేయడాన్ని సద్వినియోగం చేసుకున్న ఎకెల్‌స్టోన్..ఇసీ వాంగ్ (1)తో కలిసి ఇంగ్లండ్ పరాజయాన్ని కొంత ఆలస్యం చేసింది. వాంగ్, లారెన్ బెల్ (0)లను దీప్తీశర్మ బౌల్డ్ చేయగా, అర్థ శతకం చేసిన ఎకెల్‌స్టోన్‌ను రాణా క్లీన్‌బౌల్డ్ చేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికింది. దాంతో భారత జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. క్రాంతి గౌడ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 285; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 170;
భారత్ రెండో ఇన్నింగ్స్: 341/7 డిక్లేర్డ్.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: బౌచియర్ (ఎల్బీ) సత్గరే 2, బ్యూమాంట్ (బి) క్రాంతి 0, హీథర్ నైట్ (సి) రిచా (బి) క్రాంతి 13, బ్రంట్ (బి) స్నేహ్ రాణా 11, క్యాప్సీ (బి) సత్ఘరే 21, అమీ జోన్స్ (సి) షఫాలీ (బి) స్నేహ్ రాణా 54, మ్యాడీ విల్లీర్స్ (సి) రిచా (బి) స్నేహ్ రాణా 26, ఎకెల్‌స్టోన్ (బి) స్నేహ్ రాణా 50, ఇసీ వాంగ్ (బి) దీప్తీశర్మ 1, లారెన్ బెల్ (బి) దీప్తీశర్మ 0, లారెన్ ఫైలెర్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 62.5 ఓవర్లలో 186 ఆలౌట్; వికెట్లపతనం: 1-2, 2-6, 3-23, 4-34, 5-59, 6-126, 7-135, 8-157, 9-159, 10-186; బౌలింగ్: సయాలీ సత్ఘరే 10-2-24-2, క్రాంతి గౌడ్ 11-0-54-2, స్నేహ్ రాణా 19.5-4-42-4, శ్రీచరణి 9-2-25-0, దీప్తీశర్మ 12-0-36-2, షఫాలీ 1-0-1-0.
లార్డ్స్‌లో భారత్ విజయాలు
(పురుషులు, మహిళలు)
1986లో ఐదు వికెట్లతో (కెప్టెన్ కపిల్)
2014లో 95 పరుగులతో (కెప్టెన్ ధోనీ)
2021లో 151 పరుగులతో (కెప్టెన్ కోహ్లీ)
2026లో 270 పరుగులతో (కెప్టెన్ హర్మన్)
భారత్‌గీఇంగ్లండ్ మహిళల టెస్ట్‌లు
మ్యాచ్‌లు: 16 జూభారత్ గెలుపు: 4
ఇంగ్లండ్ గెలుపు: 1 జూడ్రాలు: 11
ఈ వార్తలనూ చదవండి:
హెలికాప్టర్ మెషిన్‌గన్‌ను నేలపై కాల్చే ప్రయత్నం.. చివరికి ఏమైందంటే..
ఇరాన్ హిట్‌లిస్ట్‌లో 13 మంది ప్రపంచ నేతలు.. ట్రంప్, నెతన్యాహు, మెలోనీ..