గెలుపు ఎలా ఉండాలంటే..
ABN , Publish Date - Feb 26 , 2026 | 05:41 AM
ఒక్క ఓటమి..ఒకే ఒక్క ఓటమి.. ఎంత పని చేసింది. సూపర్-8 తొలి పోరులో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయం టీ20 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ అవకాశాలపై పెను ప్రభావం చూపింది. సఫారీల...
రా. 7 గం. నుంచి
టాపార్డర్‌దే భారం
నేడు జింబాబ్వేతో టీమిండియా కీలక పోరు
చెన్నై: ఒక్క ఓటమి..ఒకే ఒక్క ఓటమి.. ఎంత పని చేసింది. సూపర్-8 తొలి పోరులో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయం టీ20 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ అవకాశాలపై పెను ప్రభావం చూపింది. సఫారీల చేతిలో 76 పరుగుల ఓటమితో మన రన్‌రేట్ (-3.800) ఘోరంగా పడిపోయింది. దీంతో సూపర్-8లో మిగిలిన రెండో పోటీలు భారత్‌కు చావో..రేవో అయ్యాయి. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో గురువారం జరిగే మ్యాచ్‌లో టీమిండియా తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగుతోంది. మరోవైపు బలమైన ఆస్ట్రేలియాకు, శ్రీలంకకు షాకిచ్చి సంచలన ప్రదర్శన కనబరుస్తున్న జింబాబ్వే కూడా వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. దాంతో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ తప్పక నెగ్గాల్సిన పరిస్థితి జింబాబ్వేది.
గొప్పగా ఆడాల్సిందే..: భారత్‌కు సంబంధించి ఓపెనింగ్, నెం.3 స్థానం పెద్ద తొలనొప్పిగా మారాయి. హార్డ్ హిట్టర్ అభిషేక్ శర్మ మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ కావడం టీమిండియాపై అలాంటి ఇలాంటి ప్రభావం చూపలేదు. అభిషేక్ వైఫల్యాల ప్రభావం తిలక్ వర్మపై పడుతోంది. సూర్యకుమార్ కూడా అదే పరిస్థితి. కాగా తండ్రిని చూసేందుకు స్వస్థలం వెళ్లిన రింకూ సింగ్ తిరిగి జట్టుతో చేరాడు.
శాంసన్‌కు చోటు..?: కిషన్, అభిషేక్, తిలక్ ముగ్గురూ ఎడమ చేతి వాటం బ్యాటర్లు కావడంతో..పవర్ ప్లేలోపే ఆఫ్ స్పిన్నర్లను దించడం ద్వారా ప్రత్యర్థి జట్లు మనోళ్లు పరుగులు చేయకుండా అడ్డుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కుడి చేతి బ్యాటర్ సంజూ శాంసన్‌కు చాన్స్ లభించవచ్చు. ఇక భారత బౌలింగ్ విభాగం అదరగొడుతోంది. ఈ విభాగాన్ని మరింత పటిష్టం చేసేందుకు సుందర్ స్థానంలో వైస్-కెప్టెన్ అక్షర్ పటేల్‌ను ఆడించడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు జింబాబ్వే..పోరాడితే పోయేదేమీలేదన్న తరహాలో భారత్‌ను ఎదుర్కోవాలని అనుకుంటోంది.
జట్లు (అంచనా)
భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, హార్దిక్, రింకూ సింగ్/తిలక్ వర్మ, అక్షర్, అర్ష్‌దీప్, వరుణ్, బుమ్రా
జింబాబ్వే: సికిందర్ రజా(కెప్టెన్), మరుమణి, బెన్నెట్, డియాన్ మైర్స్, ర్యాన్ బర్ల్స్, మున్యోంగా, ముసికివా, బ్రాడ్ ఇవాన్స్, క్రీమర్, ముజరబానీ, ఎన్ గరావా.
పిచ్/వాతావరణం
ఎంఏ చిదంబరం స్టేడియం పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామం. ఈ వరల్డ్ కప్‌లో స్ట్రయిక్ రేట్, సగటు స్కోర్ల కోణంలో పరిశీలిస్తే ఈ వికెట్‌కన్నా ఉత్తమమైనది మరొకటి లేదు. నల్ల మట్టితో తయారు చేసిన పిచ్‌పై మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఈ వికెట్‌పై అఫ్ఘానిస్థాన్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 17.5 ఓవర్లలో ఛేదించింది. వాతావరణం పొడిగా ఉండనుంది.
ఇవి కూడా చదవండి:
మ్యాచ్ మధ్యలో పక్షికి సీపీఆర్ చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్