Share News

సఫారీలపై సత్తా చాటాలి

ABN , Publish Date - Feb 22 , 2026 | 05:23 AM

జోరు మీదున్న టీమిండియా కీలక సమరానికి సిద్ధం కాబోతోంది. టీ20 వరల్డ్‌కప్‌ గ్రూప్‌ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచిన సూర్యకుమార్‌ సేన ఇప్పుడు సెమీస్‌ బెర్త్‌పై కన్నేసింది...

సఫారీలపై సత్తా చాటాలి

రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

సూపర్‌-8లో భారత్‌ తొలి పోరు నేడు

అహ్మదాబాద్‌: జోరు మీదున్న టీమిండియా కీలక సమరానికి సిద్ధం కాబోతోంది. టీ20 వరల్డ్‌కప్‌ గ్రూప్‌ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచిన సూర్యకుమార్‌ సేన ఇప్పుడు సెమీస్‌ బెర్త్‌పై కన్నేసింది. ఇందులో భాగంగా సూపర్‌-8 గ్రూప్‌ 1లో నేడు (ఆదివారం) తమ తొలి మ్యాచ్‌ను దక్షిణాఫ్రికాతో ఆడనుంది. అయితే తొలి రౌండ్‌లో భారత్‌ టేబుల్‌ టాపర్‌గా నిలిచినా.. ఆ స్థాయి ప్రదర్శన మాత్రం కనబర్చలేకపోయింది. పసికూన జట్లుగా భావించిన యూఎ్‌సఏ, నెదర్లాండ్స్‌ గట్టి పోటీని ఇవ్వగలిగాయి. ఒక్క పాక్‌పై మాత్రమే అన్ని విధాలుగా రాణించగలిగింది. అభిమానులు ఆశించినట్టుగా జట్టు నుంచి ఇంకా పూర్తి సామర్థ్యం రాలేదనే చెప్పవచ్చు. ఇప్పుడు ప్రతీ మ్యాచ్‌ కీలకమే కాకుండా.. ప్రత్యర్థి దక్షిణాఫ్రికా కావడంతో భారత్‌ అన్ని విభాగాల్లోనూ చెలరేగాల్సిందే. అటు సఫారీలు క్రితం టోర్నీ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉన్నారు. డికాక్‌, మార్‌క్రమ్‌, బ్రెవిస్‌, స్టబ్స్‌, రికెల్టన్‌, మిల్లర్‌లతో వీరి బ్యాటింగ్‌ దుర్భేద్యంగా కనిపిస్తోంది. అటు బౌలింగ్‌లోనూ పేసర్లు యాన్సెన్‌, రబాడ, ఎన్‌గిడి, స్పిన్నర్‌ కేశవ్‌లతో బలంగానే ఉంది.

000-Sports.jpg

అభిషేక్‌కే చాన్స్‌!

అనూహ్య రీతిలో డాషింగ్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ మూడు డకౌట్లతో ఇంకా పరుగుల ఖాతానే తెరువలేదు. అయితే తన గైర్హాజరీలో ఓపెనర్‌గా శాంసన్‌ నమీబియాపై 8 బంతుల్లోనే 22 పరుగులతో చెలరేగాడు. దీంతో నేటి మ్యాచ్‌లో ఓపెనర్‌గా ఎవరిని ఆడిస్తారనే సందేహాలు నెలకొన్నాయి. కానీ కెప్టెన్‌ సూర్య మాత్రం అభిషేక్‌పై పూర్తి నమ్మకాన్ని ఉంచాడు. అతడి ఫామ్‌ గురించి ఆందోళన పడుతున్న వారి గురించే తాను ఆందోళన పడుతున్నట్టు తేల్చాడు. అభిషేక్‌ టచ్‌లోకి వచ్చేందుకు ఒక్క ఇన్నింగ్స్‌ చాలనే అభిప్రాయంతో టీమ్‌ ఉండడంతో ఇషాన్‌తో కలిసి తనే బరిలోకి దిగే చాన్సుంది. అయితే అభిషేక్‌ త్వరగా అవుట వడం వన్‌డౌన్‌లో తిలక్‌ వర్మ బ్యాటింగ్‌పై ప్రభావం పడుతోంది. వికెట్‌ కాపాడుకునేందుకు అతను భారీ షాట్లకు వెళ్లడం లేదు. దీంతో మధ్య ఓవర్లలో స్కోరు నెమ్మదిస్తోంది. అయితే తమ సూచన మేరకే తిలక్‌ అలా ఆడాల్సి వస్తోందని కెప్టెన్‌ చెబుతున్నాడు. మిడిలార్డర్‌లో సూర్య పాక్‌, నెదర్లాండ్స్‌పై రాణించలేకపోయాడు. కాగా.. హార్దిక్‌, దూబే చివర్లో చెలరేగుతుండడం సానుకూలాంశం కానుంది. సఫారీల బౌలింగ్‌ లైనప్‌ పటిష్టంగా ఉండడంతో భారత బ్యాటర్లు సమష్ఠిగా రాణించాల్సి ఉంది. పేసర్‌ బుమ్రా, స్పిన్నర్‌ వరుణ్‌ల బంతులను గ్రూప్‌ దశలో ప్రత్యర్థి జట్లు ఆడలేకపోయాయి. కానీ సౌతాఫ్రికా బ్యాటింగ్‌ లైన్‌పను ఈ ద్వయం ఎలా అడ్డుకుంటుందనేది వేచిచూడాల్సిందే. పిచ్‌ను బట్టి కుల్దీ్‌పకన్నా అర్ష్‌దీ్‌పనకు చాన్స్‌ ఇవ్వవచ్చు. అలాగే సుందర్‌ స్థానంలో అక్షర్‌ తిరిగి బరిలోకి దిగనున్నాడు.


తుది జట్లు (అంచనా)

భారత్‌: ఇషాన్‌, అభిషేక్‌, తిలక్‌, సూర్యకుమార్‌ (కెప్టెన్‌), హార్దిక్‌, దూబే, రింకూ, అక్షర్‌, కుల్దీ్‌ప/అర్ష్‌దీప్‌, బుమ్రా, వరుణ్‌.

దక్షిణాఫ్రికా: మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), డికాక్‌, రికెల్టన్‌, బ్రెవిస్‌, స్టబ్స్‌, మిల్లర్‌, యాన్సెన్‌, బాష్‌, కేశవ్‌, రబాడ, ఎన్‌గిడి.

పిచ్‌

నరేంద్ర మోదీ స్టేడియం పిచ్‌ను నల్ల మట్టితో తయారుచేశారు. దీంతో ఈ ట్రాక్‌ స్పిన్నర్లకు అంతగా అనుకూలించకపోవచ్చు. చక్కటి బౌన్స్‌తో పేసర్లకు మాత్రం లాభిస్తుంటుంది. అలాగే భారీ స్కోర్లకు అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

'ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా భారత్‌ను సందర్శించాల్సిందే'

ట్రంప్ సంచలన నిర్ణయం.. ప్రపంచం ముందుకు ఏలియన్స్ సీక్రెట్ ఫైల్స్

Updated Date - Feb 22 , 2026 | 05:23 AM